లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది మోడీ సర్కార్. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించింది. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తగ్గించిన ధరలు రేపు ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్రం పేర్కొంది.
Advertisement
పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్ పై ఇస్తున్న రూ.300 సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్ లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 గా ఉంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సబ్సిడీ పథకం ద్వారా రూ.300 తగ్గి రూ. 655కే లభిస్తోంది.
Advertisement
ప్రధాని మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముడి జనపనార మద్దతు ధర పెంచింది. 2024-25 సీజన్‌లో ముడి జనపనారకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5,335 గా పేర్కొంది, గత సీజన్‌తో పోలిస్తే క్వింటాల్‌కు రూ. 285 పెంచమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.
Also Read : గ్రూప్-1 దరఖాస్తుల గడువు పెంపు.. ఎప్పటి వరకు అంటే..?