సాధారణం ఎవరైనా మొబైల్ రీఛార్జ్ చేసుకునే సమయంల బెస్ట్ ప్లాన్ల గురించి వెతుకుతుంటారు. ఇక ఎయిర్‌టెల్, జియో రెండు టెలికాం సంస్థలు రూ.100 కంటే తక్కువ ధరకే ప్లాన్‌లను అందిస్తున్నాయి. మీరు కూడా ఈ చవకైన ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నట్టయితే రూ.100 కంటే తక్కువ ధర ఉన్న ఎయిర్‌టెల్, జియో ప్లాన్‌ల వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టెలికాం దిగ్గజ సంస్థ జియో తన కస్టమర్ల కోసం రూ.91 ప్లాన్ అందిస్తోంది. కంపెనీ చౌక ధర ప్లాన్ ఇది. రూ.91 ప్లాన్‌లో మొత్తం 3 జీబీ కస్టమర్లకు అందించబడుతుంది. ఈ ప్లాన్ వాలిడిటి 28 రోజుల వరకు ఉంటుంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా జియో ఫోన్ ఉన్న వారి కోసం అద్భుతంగా పని చేస్తుంది. కేవలం జియోఫోన్ వినియోగదారులకే ఇది వర్తిస్తుందనే విషయాన్ని గమనించాలి. ఈ ప్లాన్ లో వినియోగదారులకు అపరిమిత కాలింగ్ సౌకర్యం ఇవ్వబడుతుంది. ఇందులో 50 ఎస్ఎంఎస్‌ల ప్రయోజనం కూడా ఉంటుంది. ఇక విశేషం ఏమిటంటే అత్యంత చౌకైన ప్లాన్‌తో కూడా కంపెనీ జియో అన్ని యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభించడం విశేషం.
Advertisement
Advertisement
ఇక ఎయిర్ టెల్ కూడా జియో మాదిరిగా రూ.100 కన్న తక్కువ ధర కలిగిన ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ ధర రూ.99. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 28 రోజుల వరకు ఉంటుంది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 200 ఎం.బీ. డేటా ఇవ్వబడుతుంది. ఇందులో లోక్ ఎస్ఎంఎస్‌కు రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్‌కు రూ.1.5 వసూలు చేస్తారు. అయితే ఇంకా ప్లాన్‌ను ఎంచుకున్న వారికి రూ.99 రూపాయల ఫుల్ టాక్ టైం లభిస్తోంది. ఫోన్‌ను తక్కువగా వినియోగించే ఎయిర్ టెల్, జియో ఖాతాదారులు ఈ ప్లాన్‌లను సెలక్ట్ చేసుకొని వినియోగించుకోవచ్చు.
Also Read :
నరేష్ పవిత్ర ల బంధం పై శపథం చేసిన నరేష్ మూడో భార్య రమ్య
వాట్సప్ లో కొత్తగా ఈ ఆప్షన్ వచ్చిందని తెలుసా ?