Home » క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్ లు భారత్ లోనే..!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఐపీఎల్ మ్యాచ్ లు భారత్ లోనే..!

by Anji
Published: Last Updated on
Ad

క్రికెట్ అభిమానులకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. లోక్ సభ ఎన్నికల కారణంగా ఐపీఎల్-2024 సెకండ్ ఫేజ్ యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు.

Advertisement

Advertisement

రెండో దశ మ్యాచ్ లు కూడా మొత్తం భారత్ లోే జరుగనున్నట్టు తెలిపారు జై షా. ” ఈ ఏడాది సీజన్ మొత్తం ఇండియాలోనే జరుగనుంది. విదేశాల్లో నిర్వహించే ఆలోచన లేదని” క్రిక్ బజ్ తో పేర్కొన్నారు. ఇప్పటికే తొలి ఫేజ్ షెడ్యూల్ ని బీసీసీఐ రిలీజ్ చేసింది. తొలి దశలో కేవలం 22 మ్యాచ్ లకు షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 22న ఈ క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. మరోవారంలో పూర్తి షెడ్యూల్ ని కూడా బీసీసీఐ విడుదల చేయనుంది. మరోవైపు లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో జూన్ 01 వరకు లోక్ సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి.

Also Read : CSK కు బిగ్ షాక్.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఔట్..!

Visitors Are Also Reading