Home » CSK కు బిగ్ షాక్.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఔట్..!

CSK కు బిగ్ షాక్.. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ ఔట్..!

by Anji
Ad

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ కి చేదువార్త అనే చెప్పాలి.  ఐపీఎల్-2024 ఆరంభ మ్యాచ్ లకు ఆ జట్టు కీలక బౌలర్ దూరం కానున్నట్లు సమాచారం. సీఎస్కే డెత్ ఓవర్ల స్పెషలిస్టు, శ్రీలంక యువ పేసర్. మతీశ పతిరణ గాయపడినట్లు తెలుస్తోంది. గత వారం బంగ్లాదేశ్లో టీ20 సిరీస్ సందర్భంగా.. తొడకండరాల నొప్పితో పతిరణ జట్టును వీడాడు. ఈ క్రమంలో అతడికి దాదాపు నాలుగు- ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.

Advertisement

దీని ఫలితంగా అతడు.. ఐపీఎల్ 17వ ఎడిషన్ లో కొన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఈ విషయం గురించి సీఎస్కే అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. “ఆటగాళ్లన్నాక గాయాలు సహజమే. అతడి గురించి శ్రీలంక క్రికెట్ బోర్డుతో మేము చర్చించాల్సి ఉంది. మా ప్రీమియర్ బౌలర్లలో తనూ ఒకడు” అని పతిరణ ప్రాధాన్యాన్ని వివరించారు.
కాగా శ్రీలంకకు చెందిన రైటార్మ్ పేసర్ పతిరణ.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కు ఆడుతున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రియ శిష్యుడిగా పేరొందిన 21 ఏళ్ల ప్రతిరణ.. ఐపీఎల్-2023 సీజన్లో అద్భుతంగా రాణించాడు.

Advertisement

మొత్తంగా 12 మ్యాచ్లు ఆడి 19 వికెట్లు పడగొట్టాడు పతీరణ. చెన్నె ఐదోసారి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024కు గానూ.. పతిరణను సీఎస్కే రిటైన్ చేసుకుంది. ఇక ప్రతిరణ గనుక ఆరంభ మ్యాచ్లకు దూరమైతే అతడి స్థానంలో బంగ్లాదేశ్ సీనియర్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ సీఎస్కే డెత్ బౌలింగ్ దళంలో చోటు దక్కించుకోనున్నాడు. కాగా మార్చి 22న సీఎస్కే- ఆర్సీబీ మధ్య చెన్నై వేదికగా  తొలి మ్యాచ్ జరుగనుంది.

Also Read :  ఆర్సీబీకి కోహ్లీతో కలిసి బాబర్ ఆడితే.. పాక్ అభిమాని పోస్ట్.. హర్భజన్ కౌంటర్..!

Visitors Are Also Reading