ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియమాకాల కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరో మూడు రోజుల పాటు పొడిగించింది. ఈనెల 22 వరకు చివరి తేదీగా నిర్ణయించగా దానిని 25వ తేదీ వరకు పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. ఫిబ్రవరి 22 చివరి తేదీగా నిర్ణయించింది.
Advertisement
Advertisement
సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్, ట్రేయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అన్ని కేటగిరిలో కలిపి మొత్తం 6100 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మార్చి 05వ తేదీన హాల్ టికెట్లను జారీ చేసి.. మార్చి 15 నుంచి 30వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ, మార్చి 31న ఆన్సర్ కీ రిలీజ్, ఏప్రిల్ 2న ఫైనల్ కీ రిలీజ్, ఏప్రిల్ 07న చివరి ఫలితాలను విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.