Home » ప్రపంచంలో అత్యంత ఖరీదైన చొక్కా భారతీయుడిదే.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు!

ప్రపంచంలో అత్యంత ఖరీదైన చొక్కా భారతీయుడిదే.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు!

by Anji
Ad

ప్రపంచంలో అత్యంత ఖరీదైన చొక్కా భారతీయుడి వద్దే ఉంది. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు పంకజ్ పరాఖ్ ఈ షర్ట్ ని కలిగి ఉన్నాడు. 2016లో గిన్నీస్ వరల్డ్ రికార్డస్ లో కూడా చోటు సంపాదించుకోవడం విశేషం. అతడినీ అందరూ సరదాగా ది మ్యాన్ విత్ ది గోల్డెన్ షర్ట్ పిలుస్తుంటారు. ఈ షర్ట్ పూర్తిగా బంగారంతో తయారు చేయబడింది. దీని బరువు 4.1 కిలోలు. బంగారు రంగులో కనిపించే ఈ చొక్కా పూర్తిగా ఫ్లెక్సిబుల్ గా, సౌకర్యవంతంగా శరీరానికి హాని కలిగించకుండా ఉంటుంది.

Advertisement

Advertisement

మడతబెట్టి రుద్దినా పగిలిపోకుండా ఉండేందుకు లోపల ఒక సన్నని క్లాత్ ను కూడా దీనికి జత చేయించినట్టు పరాఖ్ తెలిపారు. దీని ధర రూ.1.30 కోట్లు ఉండగా.. ప్రపంచంలోనే రిచెస్ట్ షర్ట్ ధరించిన వ్యక్తిగా పరాఖ్ ఈ ఘనత సాధించాడు. అదేవిధంగా పరాఖ్ దగ్గర ఇంకా చాలా విలువైన వస్తువులు ఉన్నాయి. గోల్డ్ వాచ్, చైన్స్, ఉంగరాలు, మొబైల్ కవర్ అండ్ ప్రేమ్డ్ గ్లాసెస్ వంటి మొత్తం 10 కిలోల బంగారు వస్తువులు ఉన్నాయి. ఈ ఖరదు అయిన వస్తువులన్నింటికీ ప్రత్యేకమైన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు.

అంతేకాదు.. లైసెన్స్ రివాల్వర్ కలిగి ఉన్న పరాఖ్ నడక తీరు అందరి దృష్టి ఆకర్షిస్తుంది. ఈ చొక్కాను నాసిక్ లోని బఫ్నా జ్యూవెలర్స్ డీజీఎం తయారు చేయగా.. ముంబైలోని శాంతి జ్యూవెలర్స్ డిజైన్ చేసింది. సుమారు 20 మంది కళాకారుల బృందం 3,200 గంటలు కష్టపడి ఈ చొక్కాను తయారు చేశారు. ఈ అంగి కొనుగోలుకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేవు. ఇందుకు సంబంధించిన పూర్తి బిల్లులు కూడా ఉన్నాయని పరాఖ్ టీమ్ వెల్లడించింది. 

Also Read : కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు..!

Visitors Are Also Reading