బాలీవుడ్ స్టార్, బిగ్ బీ అమితాబ్ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే, ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చేరిన ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయనకు యాంజియోపాసీ శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఇవాళ ఉదయం ఆస్పత్రికి తరలించారు. ఆయనకు యాంజియోప్లాసీ చేసిన అనంతరం సాయంత్రమే ఇంటికి పంపించారు.
Advertisement
Advertisement
అమితాబ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. 1982లో సినిమా షూటింగ్ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నాడు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో ఓ సర్జరీ చేశారు. 2020లో కోవిడ్ తో పోరాడాడు. దాన్నుంచి కోలుకున్నాడని సంతోషించేలోపు 2022లో మరోసారి కరోనాతో పోరాడి విజయం సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో తన చేతి మణికట్టుకు సర్జరీ జరిగింది. అమితాబ్ ఇటీవల టైగర్ ష్రఫ్, కృతి సనన్ నటించిన గణపతి కనిపించారు. అంతే కాకుండా ప్రభాస్ నటించిన కల్కి 2898AD చిత్రంలో కీలక పాత్రలో నటించారు.
Also Read : బాలయ్య సినిమాను రీమేక్ చేయబోతున్న జూనియర్ ఎన్టీఆర్..!