ఆన్లైన్ బెట్టింగ్ వేదిక డ్రీమ్ 11లో రూ.2కోట్లు గెలిచి రాత్రికి రాత్రి కోటీశ్వరుడయ్యాడు. బిహార్‌కు చెందిన ఓ డ్రైవర్. శారన్ జిల్లాలోని రసూల్‌పూర్‌కు చెందిన డ్రైవర్ రమేష్ కుమార్ ను అదృష్టం వరించింది. అతని ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆరంభంలో నేను రూ.49 పెట్టి ఆడేవాడిని. కొన్ని సార్లు గెలిచేవాడిని..మరికొన్ని సార్లు నిరాశ ఎదురయ్యేదని.. ఇటీవలే పంజాబ్, లక్నో మధ్య మ్యాచ్‌లో పంజాబ్ ను ఎంచుకున్నాను. రూ.59కి కెప్టెన్ గా కగిసో రబాడా, వైస్ కెప్టెన్ గా శిఖర్ ధావన్‌ను ఎంచుకున్నాను.
Advertisement
Advertisement
అదృష్టం కొద్ది ఆ మ్యాచ్‌లో రబాడా 3 వికెట్లు తీసాడు. అతడు ఎంపిక చేసుకున్న ఇతర క్రికెటర్లు కూడా చాలా బాగా ఆడడం వల్ల దేశ స్థాయిలో అతనికి మంచి పాయింట్లు లభించాయి. మ్యాచ్ జరిగిన తెల్లారి అతడే నెంబర్ స్థానంలో నిలిచి రూ.2కోట్లు గెలుచుకున్నట్టు అతనికి సందేశం వచ్చింది. జీఎస్టీ చెల్లింపుల అనంతరం అతడి ఖాతాలో రూ.1.4 కోట్లు వచ్చి చేరాయి.
రమేష్ కుమార్ జీవితాన్ని ఒక్కసారిగా మార్చి వేసింది ఈ సొమ్ము. అతని తండ్రి రోజు కూలీగా పని చేస్తూ ఉంటాడు. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావడాన్ని రమేష్ నమ్మలేకపోతున్నాడు. ఈ డబ్బును తన పిల్లల చదువులకు సమాజ శ్రేయస్సు కోసం వాడుతానని చెప్పారు.
Also Read :
వీరి చేతిలో డబ్బు అస్సలు నిలబడదు.. వారు ఎవరో తెలుసా..!!
దర్శకుడు వెంట పడినా బ్లాక్ బస్టర్ సినిమా “బాషా” కు బాలయ్య ఎందుకు నో చెప్పారో తెలుసా ….!