Home » స్టార్ హీరో విక్ర‌మ్‌కి గోల్డెన్ వీసా.. అయితే న‌టి పూర్ణ‌కి సంబంధం ఏంటీ ?

స్టార్ హీరో విక్ర‌మ్‌కి గోల్డెన్ వీసా.. అయితే న‌టి పూర్ణ‌కి సంబంధం ఏంటీ ?

by Anji
Ad

త‌మిళ న‌టుడు, స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. దుబాయ్ ప్ర‌భుత్వం విక్ర‌మ్‌కి తాజాగా గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ విష‌యాన్ని న‌టి పూర్ణ సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించింది. ప్ర‌ధానంగా పూర్ణ త‌న భర్త‌తో క‌లిసి విక్ర‌మ్ కి దుబాయ్ వీసా అందిస్తున్న ఫోటోను షేర్ చేసింది పూర్ణ‌. ఇదివ‌ర‌కు కూడా చాలా మంది భార‌తీయ న‌టుల‌కు గోల్డెన్ వీసా ల‌భించింది.

Also Read : జులాయి, అల వైకుంఠ పురం సినిమాలలో ఉన్న ఒకే కామన్ పాయింట్ ను గమనించారా…?

Advertisement

Manam

ఇక వారిలో మోహ‌న్ లాల్‌, మ‌మ్ముట్టి, షారూఖ్ ఖాన్‌, క‌మ‌ల్ హాస‌న్‌, త్రిష‌,కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పాటు ప‌లువురు న‌టీ, న‌టులు గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ జాబితాలో చియాన్ విక్ర‌మ్ కూడా చేర‌డం విశేషం. ఇదిలా ఉండ‌గా.. న‌టి పూర్ణ‌, షానిద్ ఆసిఫ్ దంపతుల చేతుల మీదుగా విక్ర‌మ్‌కి గోల్డెన్ వీసా ఇవ్వ‌డం ఏమిట‌ని ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ చ‌ర్చ న‌డుస్తోంది. ఈ విష‌యంపై పలువురు నెటిజ‌న్లు ఆరా కూడా తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పూర్ణ భ‌ర్త చొరువ‌తోనే విక్ర‌మ్‌కి గోల్డెన్ వీసా వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

Advertisement

 

Also Read :  మహేష్‌ బాబు త‌న కెరీర్‌లో కేవ‌లం ఒక్క సినిమాకి మాత్ర‌మే మేక‌ప్ వేసుకోలేదు.. అది ఏ సినిమానో తెలుసా ?

Manam

పూర్ణ భ‌ర్త షానిద్ ఆసీప్ అలీ యూఏఈలో పెద్ద వ్యాపార‌స్తుడు. షానిద్ త‌న కంపెనీ ద్వారానే విక్ర‌మ్‌కి గోల్డెన్ వీసా వ‌చ్చేలా చేశాడ‌ని సినీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సినీ, సాహిత్యం, విద్య‌, క‌ల్చ‌ర్ త‌దిత‌ర రంగాల్లో విశిష్ట సేవ‌లందిస్తున్న వారికి యూఏఈ ప్ర‌భుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తుంది. ఇక ఈ గోల్డెన్ వీసాల ద్వారా అర‌బ్ దేశాల‌లో ఎలాంటి ప‌రిమితులు లేకుండా అయినా నివ‌సించ‌వ‌చ్చు. 2019 నుంచి యూఏఈ ప్ర‌భుత్వం ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వ‌స్తోంది.

 

Also Read : ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోనున్న విశాల్.. ఇంతకి ఆమె ఎవరంటే ?

 

Visitors Are Also Reading