Telugu News » Blog » బ్రహ్మం గారి కాలజ్ఞానం మరో సారి నిజమైందా ? నేపాల్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసా ?

బ్రహ్మం గారి కాలజ్ఞానం మరో సారి నిజమైందా ? నేపాల్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసా ?

by AJAY
Ads

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రాబోయే రోజులలో ఏం జరుగుతుంది. దాని వల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనే విషయాలను ముందుగానే చెప్పారు. ఆయన చెప్పిన విషయాలు అన్ని బ్రహ్మం గారి కాలజ్ఞానం పేరుతో లిఖిత పూర్వకంగా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కాల జ్ఞానాన్ని చాలా మంది నమ్ముతారు. బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని ఎక్కువ మంది విశ్వసించాడనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.

Ads

ఆయన కాలజ్ఞానం లో చెప్పిన చాలా విషయాలు ఇప్పటికే జరిగిపోయాయి. అందులో వెంపలి చెట్టుకు నిచ్చెన వేసే మరగుజ్జులు పుట్టడం…..ఆవుకు ఐదు కాళ్ళు ఉండటం..అంతెందుకు కరోనా గురించి కూడా బ్రహ్మం గారు ముందే చెప్పారు. కొరంకి అనే జబ్బు ఒకటి వచ్చేను కోటి మంది గిల గిల చచ్చేనూ అని ముందే బ్రహ్మం గారు కాలజ్ఞానం లో చెప్పారు. చెప్పినట్టు గానే కరోనా వచ్చింది…చాలా మంది చనిపోయారు.

Ads

ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పిన మరో విషయం కూడా జరిగింది. బ్రహ్మం గారి కాలజ్ఞానం లో బంగారు తాబేలు జన్మిస్తుంది అని చెప్పారు. అయితే ఇప్పుడు అది కూడా జరిగిపోయింది. నేపాల్ లో బంగారు తాబేలు ను గుర్తించారు. సాధారణంగా అక్కడ తాబేలును దేవుడిగా పూజిస్తారు.

Ad

దాంతో ఇప్పుడు బంగారు తాబేలు దేవుడు అని నమ్ముతున్నారు. మరోవైపు ఈ వార్త వైరల్ అవ్వడం తో అచ్చం బ్రహ్మం గారు చెప్పినట్టే బంగారు తాబేలు పుట్టింది అని మానవాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంకా ముందు ముందు బ్రహ్మంగారు చెప్పినవి ఎన్ని జరుగుతాయేమో అని అనుకుంటున్నారు.