Home » వారికి బంపరాఫర్….సీఎం పుట్టినరోజుకు కానుకగా గోల్డ్ రింగ్స్…!

వారికి బంపరాఫర్….సీఎం పుట్టినరోజుకు కానుకగా గోల్డ్ రింగ్స్…!

by AJAY
Ad

సాధారణంగా అభిమాన హీరోలు…. రాజకీయ నాయకుల పుట్టిన రోజులు వచ్చాయి అంటే ఫాన్స్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. రక్తదానం చేయడం పండ్లు ఫలాలు పంచడం లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ తాజాగా ఓ ఎమ్మెల్యే ఏకంగా బంగారు ఉంగరాలు పంచుతామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరికి కాకుండా తమ ముఖ్యమంత్రి పుట్టినరోజున పుట్టే పిల్లలకే ఉంగరాలు పంచుతామని ప్రకటించారు.

Advertisement

Advertisement

ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూర్ జిల్లా లో చోటుచేసుకుంది. తాజాగా జిల్లాలో డీఎంకే కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ భూపతి, తిరువూరు ఎమ్మెల్యే రాజేంద్ర పాల్గొన్నారు. ఈ సమావేశంలో తిరువల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలలో జన్మించిన శిశువులకు బంగారు ఉంగరాలు అందజేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు

Visitors Are Also Reading