జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఓ వ్యక్తి జీవితంలో జరిగే మంచి, చెడు సంఘటనలు గ్రహాల కదలికపై ఆధారపడి ఉంటాయి. ఓ వ్యక్తి జాతకంలో గ్రహం శుభస్థానంలో ఉంటే.. ఆ వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు. ఆ వ్యక్తి జాతకంలో గ్రహం స్థానం అశుభంగా ఉన్నట్టయితే అతను పనిలో నిరంతరం వైఫల్యాలు చెందుతాడు. మరికొన్ని గంటల వ్యవధిలోనే మనం నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. నూతన సంవత్సరంలో బుధగ్రహం తన గమనాన్ని మార్చుకోనున్నది. మేధస్సు, ప్రసంగం, సాంకేతికత, వ్యాపారానికి కారకంగా పరిగణిస్తారు. 2022 చివరి రోజుల నుంచి 2023 ప్రారంభం వరకు పలుమార్లు తన గమనాన్ని మార్చుకుంటుంది.
Advertisement
మొత్తం తొమ్మిది గ్రహాల్లో బుధుడుని యువరాజు అని పిలుస్తారు. డిసెంబర్ 31, 2022 బుధుడు తిరోగమనంలో ఉన్నప్పుడు బృహస్పతి అధిపతి ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. జనవరి 18, 2023న బుధుడు ప్రత్యక్ష మార్గంలోకి మార్చుకుంటాడు. ఫిబ్రవరి 07, 2023న మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఏడాది ప్రారంభంలోనే బుధుడు రాజయోగాన్ని సృష్టిస్తాడు. బుధుడి సంచారంతో సంవత్సరం ప్రారంభంలో రాజయోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి విశేషమైన అదృష్టం కలిసొస్తుంది.
Advertisement
ముఖ్యంగా మేష, మిథున, కన్య, ధనుస్సు, మీన రాశుల వారికి రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశుల వారికి శుభఫలితాలుంటాయి. ఈ ఐదు రాశుల వ్యక్తులు తమ రంగాల్లో ఆర్థికంగా శుభఫలితాలను అందుకుంటారు. తమ కెరీర్ లో కూడా మంచి విజయం సాధించే అవకాశముంది. ఈ యోగం వల్ల మొత్తం 5 రాశుల వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో భాగస్వామ్యం నుంచి మంచి లాభాలు పొందే సంకేతాలున్నాయి. ఈ సమయంలో డబ్బు నిలిచిపోయిన వారికి డబ్బు వస్తుంది. ఆకస్మిక ధనలాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి గల వ్యక్తులు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి డబ్బు పొందవచ్చు. వివాదాలు సద్దుమణిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపార రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు.
Also Read : SR.NTR ఆ హీరోయిన్ ని మాత్రమే అమ్మా అని పిలిచేవారట..ఎవరంటే..?