Home » ఇలాంటి వారితో అమ్మాయిలు చాట్ చేశారంటే… అంతే సంగతులు !

ఇలాంటి వారితో అమ్మాయిలు చాట్ చేశారంటే… అంతే సంగతులు !

by Anji
Ad

సాధారణంగా ఆడ, మగ వారి  మధ్య బంధం ఎల్లప్పుడూ ప్రేమ, పెళ్లి బంధమే కానవసరం లేదు. అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహబంధం కూడా అయి ఉండవచ్చు. ఆ స్నేహం.. బెస్ట్ ఫ్రెండ్ షిప్ కూడా కానవసరం లేదు.  సాధారణ స్నేహబంధం అయి ఉండవచ్చు. బాగా పరిచయమున్న వారు కూడా కావచ్చు. వారికి ఉన్న ఆ పరిచయం కాస్త చాటింగ్ చేసే స్థాయికి ఎదగవచ్చు. ఈ చాటింగ్ తరువాత పాజిటివ్ లేదా నెగిటివ్ ఇంపాక్ట్ చూపే అవకాశముంది. కొద్ది రకాల మగాళ్లతో చాటింగ్ చేస్తే  భవిష్యత్ లో నష్టపోక తప్పదు. ఇలాంటి వ్యక్తులు ఎవ్వరో అసలు తెలుసుకొని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. మెల్లమెల్లగా వారితో చాటింగ్ చేయడం మానుకోవడం చాలా ఉత్తమం. ముఖ్యంగా ఈ లక్షణాలు కలిగిన వారితో అమ్మాయిలు చాటింగ్ అస్సలు చేయకూడదు. వారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Also Read :  Today Rasi Phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి అన్ని విధాలుగా నష్టాలే

Advertisement

ప్రతీ విషయంలో తమదే పైచేయి అని ఫీల్ అవుతూ ఉంటారు కొంత మంది మగాళ్లు. ప్రధానంగా పక్కవారు తమ కంటే కొంచెం ముందంజలో ఉన్నా అస్సలు సహించలేరు. ఇలాంటి వారితో చాటింగ్ చేసేటప్పుడు అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి కంటే మీరు గొప్పగా ముందంజలో ఉన్నారని తెలిస్తే.. మీపై కుట్రలకు తెరతీస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇది పురషాధిక్య సమాజం కాబట్టి చాలా విషయాల్లో స్త్రీలకు స్వేచ్ఛ లేకుండా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆధిక్యత చూపే మగాళ్లతో చాటింగ్ అంత మంచిది కాదు జాగ్రత్తగా ఉండాలి. కొంత మంది మగాళ్లు అర్జున్ రెడ్డి సినిమాలో హీరో లాంటి వారు కేవలం వెండి తెరపై మాత్రమే బాగుంటారు. నిజ జీవితంలో వారితో స్నేహం, చాటింగ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వారు మిమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. ప్రతీ విషయానికి ఇబ్బంది పెట్టే అవకాశముంది. వారి కోపం వల్ల మీరు మానసిక ఆనందానికి దూరమవుతూ ఉండాల్సి వస్తుంది.  

Advertisement

Also Read :   రోజురోజుకు బట్టలు సైజు తగ్గిస్తున్న అల్లు స్నేహ… దారుణంగా ట్రోలింగ్!

Manam News

సాధారణంగా ఆడ వారికంటే మగవారికే కొంచెం ఎక్కువగా కోర్కెలుంటాయి.  ఎక్కువ కోరికలు ఉండే మగాళ్లతో  ప్రమాదం పొంచి ఉంది. వీరు కేవలం సె*  కోసం మాత్రమే స్నేహం చేస్తారు. అమ్మాయిలతో మంచిగా మసులుకుంటారు. వీరి అంతిమ లక్ష్యం **ర అనుభవం పొందడమే. అదేవిధంగా చాటింగ్ చేసే ప్రతీ సారి *తు పదాలు  వాడే వారితో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరితో క్లోజ్ అయ్యే కొద్ది ఆడవారిపై కూడా ఆ పదాలను వాడుతుంటారు. ఇష్టం వచ్చినట్టు తిట్టడం ప్రారంభిస్తారు. ఉన్నది కొద్ది పరిచయమే అయినా కొంత మంది అందరితో తమకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంటారు. ఇలా ఎవ్వరితో పడితే వారితో అన్ని విషయాలు చెప్పడం అంత మంచిది కాదు. వారు మీ రహస్యాలను బయటికి చెప్పే అవకాశం ఉంది. మీ గురించి వేరే వాళ్లకు చెబుతారని తెలియగానే వారిని దూరం పెట్టడం చాలా మంచిది. లేదంటే మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేసే అవకాశముంది జాగ్రత్త..!

Also Read :  భ‌ర్త ఇంట్లో లేన‌ప్పుడు భార్య చేయ‌కూడ‌ని ప‌నులు…ఈ ప‌నులు చేశారంటే ఇక అంతే..!

Visitors Are Also Reading