సాధారణంగా ఇంట్లో కానీ, బంధువుల ఇళ్లలో కానీ ఏదైనా శుభకార్యం జరుగుతుందంటే అమ్మాయిలు మేకప్ వేసుకొని అందంగా తయారవుతుంటారు. అమ్మాయి జీవితంలో నిశ్చితార్థం, వివాహం రెండు ముఖ్యమైన సందర్భాలుంటాయి. వారి జీవిత భాగస్వామిగా అఫిషియల్ గా మారడానికి తొలి అడుగు నిశ్చితార్థం. అందుకే వారికి ఇది చాలా స్పెషల్ అనే చెప్పాలి. నిశ్చితార్థం సందర్భంగా అమ్మాయిలు చాలా అందంగా కనిపించేందుకు ముస్తాబవుతుంటారు. కొందరూ అమ్మాయిలు నిశ్చితార్థం వేళలో కొన్ని తప్పులు చేస్తుంటారు. దీని ఫలితంగా వారు కాస్త నిరాశకు గురవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్ని పొరపాట్ల కారణంగా వారి లుక్ పాడవుతుంది. అలా కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
- ఏదైనా ప్రత్యేక ఫంక్షన్ ఉన్నట్టయితే రెండు, మూడు రోజుల ముందే ఫేషియల్ చేయించాలి. డీప్ క్లీనింగ్ కారణంగా ముఖంపై మొటిమలు, ఎరుపు దద్దుర్లు కనిపిస్తుంటాయి. ముందే ఫేషియల్ చేయించుకోవడం వల్ల ఫంక్షన్ సమయానికి ముఖం సాధారణ స్థితికి చేరుకుంటుంది.అదే రోజు ఫేషియల్ చేయించుకుంటే ముఖంపై మచ్చలు, మొటిమలు, దద్దుర్లు కనిపిస్తాయి.
- చాలా మంది హోమ్ రెమిడీస్ ప్రయోగాలు చేస్తుంటారు. అలా చేయకూడదు. ఫంక్షన్ రోజు వంటింటి చిట్కాలు అస్సలు ప్రయత్నించకూడదు. ఏదైనా ప్రతిచర్య జరిగితే.. దాని ప్రభావం ముఖంపై చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మేకప్ వేసుకున్నా ఫలితం ఉండదు.
Also Read : మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ 5 కూరగాయలను తప్పక తీసుకోండి.. ఫలితం పక్కా..!
Advertisement
- స్పెషల్ అకేషన్ అని చాలా ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడుతుంటారు. ఇందులో భాగంగా ఎక్కువగా కొత్త ప్రొడక్ట్స్ ని ప్రయత్నిస్తారు. కానీ అలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మీ అందం పాడయ్యే అవకాశముంది. మొదటి నుంచి వినియోగిస్తున్న స్కిన్ టోన్ ఫౌండేషన్ ప్రోడక్ట్స్ నే వాడాలి. లేదంటే స్కిన్ టోన్ లో తేడాలు కనిపిస్తాయి.
- నటీనటుల శరీరం, ముఖం, ఒకే టోన్ లో ఉండడానికి కారణం ముఖానికి వేసే మేకప్ ని శరీరానికి కూాడా వేస్తారు. దాని కారణంగానే ముఖం, మెడ, చేతులు, ఇలా శరీరమంతా ఒకే టోన్ లో కనిపిస్తుంటుంది. మేకప్ విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలి.
- మీరు ధరించే డ్రెస్, ఈవెంట్ ప్రకారం.. హెయిర్ స్టైల్ ఎంపిక చేసుకోవాలి. కొందరూ సెలబ్రిటీల హెయిర్ స్టైల్ ఫాలో అవుతుంటారు. అలా చేయకూడదు. హెయిర్ స్టైల్ స్టైలీష్ గా ఉండడమే కాకుండా.. మీ ముఖానికి కూడా సూట్ అయ్యేవిధంగా సెట్ చేయించుకోవాలి. ముఖానికి, హెయిర్ స్టైల్ కి మధ్య చాలా తేడా కనిపిస్తుంది.
Also Read : సినిమాలు వద్దు బాబోయ్ అని అమెరికా వెళ్లిపోయిన వెంకటేష్..మళ్లీ ఎవరివల్ల తిరిగి వచ్చారంటే..?