దర్శక ధీరుడు రాజమౌళి-యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు తెరకెక్కాయి. అందులో ఆర్ఆర్ఆర్ చిత్రం మల్టీస్టారర్ మూవీ కాబట్టి దానిని పక్కకు బెడితే.. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు మంచి హిట్ సాధించాయి. ఆ మూడింటిలో సింహాద్రి చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. 2003లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ సునామీనే సృష్టించింది. ఇప్పుడు మరోసారి థియేటర్లలో కనువిందు చేసేందుకు సిద్ధం అవుతోంది.
Advertisement
అయితే ఈ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్లను నిరుపేద అభిమానులకు అందజేయనున్నట్టు ఎన్టీఆర్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరోలకు చెందిన పలు సినిమాలు రీరిలీజ్ అవుతూ మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, తమ్ముడు, జల్సా, మహేష్ బాబు నటించిన పోకిరి, రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ రీ రిలీజ్ అయి మరోసారి మంచి పేరు సంపాదించుకున్నాయి. ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా దేశ ముదురు చిత్రం కూడా మరోసారి థియేటర్లలో విడుదలైంది. దీంతో బన్నీ అభిమానులు సంబురాలు చేసుకున్న విషయం తెలిసిందే. మరికొన్ని సినిమాలకు వస్తున్న ఆదరణ, కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని స్పెషల్ స్క్రీనింగ్ కూడా వేస్తున్నారు.
Advertisement
అలాంటి వాటిలో ఖుషి, ఆరెంజ్ సినిమాలు నిలిచాయి. రీ రిలీజ్ అయినటువంటి సినిమాలకు వచ్చిన కలెక్షన్లతో మరోసారి మేకర్స్ ఎంజాయ్ చేస్తుంటే.. కొన్ని సినిమాలను మళ్లీ విడుదల చేయడం ద్వారా వచ్చే అమౌంట్ ని పేదవారికి లేదా ఏదైనా పార్టీకి విరాళంగా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేయడం ద్వారా వచ్చిన కలెక్షన్లను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఇవ్వాలని నిర్ణయించినట్టు మెగాబ్రదర్ నాగబాబు ప్రకటించారు. ఈ చిత్రం రీరిలీజ్ అయి రూ.3కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. రీరిలీజ్ ద్వారా వచ్చిన అమౌంట్ ని ఏదో ఒక పనికి లేదా సంస్థకు డొనేట్ చేయడం ట్రెండింగ్ గా మారిపోయింది.
Also Read : నాకు ఆ అమ్మాయి కోడలిగా కావాలంటున్న ప్రభాస్ తల్లి..!!
అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్, భూమిక నటించిన సింహాద్రి చిత్రం తారక్ పుట్టిన రోజు సందర్భంగా మే 20న రీరిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి సంబంధించి 4కె డిజిటల్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. ఆల్ ఇండియా ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమాని కొనుగోలు చేసి రీరిలీజ్ చేస్తుండటం చెప్పుకోదగిన విషయం. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం రీరిలీజ్ పై తాజాగా ఎన్టీఆర్ అభిమానులు ఓ ప్రెస్ రిలీజ్ చేశారు. ఈ సినిమా ద్వారా కలెక్షన్లను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎన్టీఆర్ అభిమానులకు అందించనున్నట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ కి కూడా చెప్పామని, ఆయన కూడా తమకు మద్దతు తెలిపినట్టు ప్రకటనలో తెలియజేశారు. ఇంత మంచి పని చేస్తున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ తమను అభినందించారని ప్రెస్ నోట్ లో పేర్కొన్నారు.
Also Read : అల్లు అర్జున్ పుష్ప సినిమాలో ‘తగ్గేదెలే’ డైలాగ్ వెనుక దాగి ఉన్న కథ ఇదే..!