Home » ఘని స్పెషల్ సాంగ్ విడుదల…రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ..!

ఘని స్పెషల్ సాంగ్ విడుదల…రెచ్చిపోయిన మిల్కీ బ్యూటీ..!

by AJAY
Ad

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఘని. ఈ సినిమా కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ లాక్ డౌన్ నుండి ఎంతగానో కష్టపడుతున్నాడు. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడిగా సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. అంతేకాకుండా సినిమాలో ముఖ్యపాత్రలో హీరో ఉపేంద్ర, సునీల్ శెట్టి నటిస్తున్నారు.

Advertisement

మరోవైపు ఈ సినిమాలో నవీన్ చంద్ర కూడా కీలక పాత్రలో నటించడం విశేషం. ఇక ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూర్చారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మరియు పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టర్లు మరియు గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ మరో అప్డేట్ వదిలింది. తమన్నా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. రింగా రే రింగా అంటూ సాగే స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియో లో తమన్నా ఆకట్టుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. మిల్కీ బ్యూటీ తన స్టెప్పులతో స్టేజ్ ను బద్దలు కొట్టింది. ఇక ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి స్వరాలు సమకూర్చారు.

Also read : దీప్తి షణ్ముక్ బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్ళా…సిరి హన్మంత్ ఎమోషనల్….!

Visitors Are Also Reading