Home » “గంగోత్రి” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా..? ఏం చేస్తుందంటే..?

“గంగోత్రి” చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూశారా..? ఏం చేస్తుందంటే..?

by AJAY
Ad

టాలీవుడ్ లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వాళ్లు చాలామంది ఇప్పుడు హీరోలు హీరోయిన్ లుగా పరిచయం అవుతున్నారు. హీరో తరుణ్ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి కూడా సక్సెస్ అయ్యాడు. అంతేకాకుండా హీరో తనిష్ కూడా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా సక్సెస్ ను అందుకున్నాడు.

Advertisement

రీసెంట్ గా చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా మెప్పించిన తేజ సజ్జ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే ఓ సూపర్ హిట్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం భారీ గ్రాఫిక్స్ తో హనుమాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఒకప్పుడు గంగోత్రి సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కావ్య కూడా ప్రేక్షకులకు గుర్తు ఉండే ఉంటుంది.

Advertisement

ఈ సినిమాలో వల్లంగి పిట్ట పాటతో కావ్య ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ సినిమా తర్వాత ఆమె హెయిర్ స్టైల్ చాలా ఫేమస్ కూడా అయింది. కావ్య గంగోత్రి సినిమాతోపాటు విజయేంద్ర వర్మ, బాలు సినిమాలలోను నటించి మెప్పించింది. ఆ తర్వాత కావ్య సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇక ఇప్పుడు కావ్య సోషల్ మీడియాలో లక్షల్లో అభిమానులను సంపాదించుకుంది.

అంతేకాకుండా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయింది. కావ్య ప్రస్తుతం “మసూదా” అనే సినిమాలో నటిస్తోంది. ఇదిలా ఉండగా కావ్య సినిమాలోకి రావాలనుకున్నప్పుడు మొదట రాఘవేంద్రరావు వద్దకు వెళ్లి కలిసారట. దాంతో తాను ప్రస్తుతం పెళ్లి సందడి అనే సినిమా చేస్తున్నానని రెండు నెలల ముందువస్తే ఆ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చేవాడినని చెప్పారట.

Visitors Are Also Reading