Home » కరెన్సీ నోట్ పై గాంధీ బొమ్మ! ఫోటోనా? డ్రాయింగా?

కరెన్సీ నోట్ పై గాంధీ బొమ్మ! ఫోటోనా? డ్రాయింగా?

by Azhar
Ad

RBI 1996 నుండి క‌రెన్సీ నోట్ల‌పై గాంధీ బొమ్మ‌ను ముద్రిస్తూ వ‌స్తుంది. అయితే చాలా మందిలో ఒక డౌట్ మాత్రం అలాగే ఉంది. క‌రెన్సీ నోటు మీద క‌నిపిస్తున్న గాంధీ బొమ్మ ఫోటో తీసిందా ? లేక చేయితో డ్రాయింగ్ చేశారా అని!

Advertisement

ఇది ఫోటోనే..1946 లో కాబినెట్ మిషన్ కోసం అప్పటి వైస్రాయ్ అధికార నివాసం ( ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ ) లో కేబినెట్ సభ్యుడు అయినా పెతిక్ లారెన్స్ తో గాంధీ మాట్లాడుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది. వాస్త‌వంగా తీసిన ఫోటోలో గాంధీ కుడివైపుకు తిరిగి ఉన్నాడు, రివ‌ర్స్ ఇమేజ్ వాడి గాంధీని మ‌న క‌రెన్సీలో ఎడ‌మ‌వైపుకు తెచ్చారు.

Advertisement

కాబినెట్ మిషన్ స్టోరి ఏంటి?

మనదేశ రాజ్యాంగ రచన పై బ్రిట‌న్ క్యాబినెట్ నుండి 3 మంత్రులు వ‌చ్చి ఇక్క‌డి రాజ‌కీయ పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. రాజ్యాంగ ర‌చ‌న ప‌ట్ల ఇండియ‌న్ కాంగ్రెస్ సానుకూలంగా ఉన్న‌ప్ప‌టికీ ముస్లీం లీగ్ నిరాక‌రించ‌డంతో ఈ భేటీ ఎలాంటి ఫ‌లితం లేకుండానే ముగిసింది.

gandhi on currency note

Visitors Are Also Reading