Home » Ram Charan: గేమ్ చేంజర్ పాటను.. తమన్ ఎక్కడ నుండి కాపీ చేసారో తెలుసా..?

Ram Charan: గేమ్ చేంజర్ పాటను.. తమన్ ఎక్కడ నుండి కాపీ చేసారో తెలుసా..?

by Sravya
Ad

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ విపరీతంగా ఎదురుచూస్తున్నారు. సినిమా యూనిట్ అప్డేట్ల కోసం ప్రేక్షకుల్ని ఎంతగానో ఎదురు చూసేలా చేస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా నుండి ఒక పాటని దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ బయటకు తీసుకువచ్చింది. జరగండి అనే పాటనే విడుదల చేశారు వాస్తవానికి దసరా పండగ నాడు ఈ పాటను విడుదల చేద్దామని అనుకున్నారు కానీ అవ్వలేదు ఏమైందో తెలియదు కానీ పాట వాయిదా పడుతూ వచ్చింది.

jaragandi-song-copy

Advertisement

 

చివరికి మార్చి 27న విడుదల అయింది వివిధ వేదికల వద్ద ఈ ప్రశ్నని దిల్ రాజుని అడిగితే సమాధానాన్ని దాటేస్తూ వచ్చారు. పాటలో క్వాలిటీ కోసం ఎన్ని రోజులు పడుతుంది అని అన్నారు. జరగండి అనే పాటకి అనంత శ్రీరామ్ రచయితగా వ్యవహరించారు. తమన్ స్వరపరిచారు. దలేర్ దలేర్ మహేంది, సునిధి చౌహన్ ఈ పాటని పాడారు. ఈ పాట రిలీజ్ చేయడానికి ముందు మూవీ యూనిట్ విపరీతమైన హైప్ ని క్రియేట్ చేశారు పాటని చాలా గ్రాండ్ గా తీశామని అన్నారు.

Also read:

Advertisement

కోట్లలో డబ్బులు ఖర్చు చేసినట్లు చెప్పారు విడుదల చేసిన తర్వాత పాట వింటే క్యాచీ ట్యూన్ లానే అనిపించట్లేదు. పైగా మహేంది అంత అద్భుతంగా పాడినట్లు కనపడట్లేదు పాటలో కొంతలో కొంత రిలీఫ్ ఏంటంటే సునిధి చౌహాన్ వాయిస్. ఈ పాట ట్యూన్స్ బ్యాగ్రౌండ్ శక్తి మూవీలో సురో సుర్ర పాటలానే ఉంది. శక్తి సినిమాలోని ఈ పాటకి మణి శర్మ స్వరపరిచారు రామ్ చరణ్ అభిమానులు మాత్రం నిరాశ చెందుతున్నారు. ట్యూన్స్ ని కాపీ చేస్తారని ఆరోపణలు తమన్ మీద ఉన్నాయి. ఈ పాటని కూడా శక్తి సినిమా నుండి ఈ కాపీ చేయడం రామ్ చరణ్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీలో ఇటువంటి పాట ఉండడం తో విమర్శలను ఎదుర్కొంటున్నారు. మా మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading