Home » ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ సూర్యనే..!

ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ సూర్యనే..!

by Azhar
Ad

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఇండియా సెమీస్ కు వచ్చింది అంటే ముఖ్య కారణం విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్. ఈ ఇద్దరు కూడా ఇండియా బ్యాటింగ్ భరణి ప్రతి మ్యాచ్ లో మోస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఈ టోర్నీలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ ఉండగా.. సూర్య మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

కానీ ఈ ప్రపంచ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు మాత్రం సూర్య కుమార్ నే వరిస్తుంది అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. తాజాగా గంభీర్ మాట్లాడుతూ.. ఇండియా జట్టులో కోహ్లీ, రోహిత్ వంటి బ్యాటర్లు ఉండవచ్చు కానీ.. సూర్య కుమార్ యాదవ్ మొత్తం డిఫరెంట్ అని.. అతను మొదటి బంతి నుండే మ్యాచ్ ను ఎంజాయ్ చేస్తాడు అను పేర్కొన్నారు.

Advertisement

అలాగే నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా ఆ స్థానంలో వచ్చే వారికీ పవర్ ప్లే అనేది ఉండదు. అయిన కూడా సూర్య కుమార్ యాదవ్ ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు అనేవి చేసాడు. అలాగే 190 కి పైగా స్ట్రైక్ రేట్ అనేది మెంటేన్ చేయడం మాములు విషయం కాదు అని.. సూర్య కుమార్ యాదవ్ వంటి ఆటగాడు ఇండియా జట్టులోకి ఇప్పటివరకు రాలేదు అని గంభీర్ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

నేను ఇంకా జట్టులో ఉండటానికి కారణం అతనే..!

వచ్చే ప్రపంచ కప్ ఆడే దేశాలు ఇవే..!

Visitors Are Also Reading