కన్నడ యువహీరో యశ్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఏమిటో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. నార్త్, సౌత్ అని తేడా లేకుండా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. కేజీఎఫ్ సినిమాతో యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఈ చిత్రం హిందీలో కూడా ఇరుగదీస్తుంది. మొదటి వారంలోనే బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ రికార్డులను క్రాస్ చేసిందంటే అతిశయోక్తి కాదు. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. హిందీలో కూడా ఆల్ టైమ్ ఫస్ట్ డే రికార్డును క్రియేట్ చేయడం విశేషం.
Advertisement
హిందీలో రూ.336.88 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన దంగల్ మూవీ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌కు చేరువలో ఉన్నది. ముఖ్యంగా తొలి నాలుగు రోజులు సెలవులు కావడం కేజీఎఫ్2 మంచి వసూళ్లనే దక్కించుకుందని చెప్పొచ్చు. 13వ రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి వసూళ్లనే దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 13వ రోజు రూ.0.94 కోట్ల షేర్ సాధించింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి రూ. 78 కోట్ల బిజినెస్ చేయగా.. రూ.79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. తెలుగులో ఇంకా రూ.3.35 కోట్ల షేర్ రాబట్టాలి. తెలంగాణలో బ్రేకు ఈవెన్ అయిన ఈ సినిమా ఏపీలో పలు ప్రాంతాల్లో బ్రేకు ఈవెన్ కావాల్సి ఉంది.
కేజీఎఫ్ 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.466.25 కోట్ల షేర్ (942.75) కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.345 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేయగా.. కొన్ని ప్రాంతాల్లో బ్రేకు ఈవెన్ కాకపోయినా ఓవరాల్‌గా ఈ చిత్రం మాత్రం బ్రేకు ఈవెన్ పూర్తి చేసుకుంది. తెలంగాణలో రూ.39.08 కోట్లు/ 25 కోట్లు, రాయలసీమలో రూ.10.54 కోట్లు /రూ.14 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.6.89 కోట్లు/ రూ.10 కోట్లు, వెస్ట్ రూ. 3.22 కోట్లు రూ.6 కోట్లు, గుంటూరు రూ.4.21 కోట్లు రూ.7 కోట్లు, కృష్ణా రూ.3.81 కోట్లు రూ.6కోట్లు, నెల్లూరు రూ.2.55 కోట్లు రూ.3 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో రూ.75.45 కోట్లు షేర్ (రూ.121.30 కోట్లు గ్రాస్) రాబట్టింది. ఏయే ప్రాంతాల్లో ఎంత రాబట్టిందంటే..?
Advertisement
కర్ణాటక రూ.83.25 కోట్లు ( రూ.141.50 కోట్లు గ్రాస్) రూ.100 కోట్లు, తెలుగు రూ.75.45 కోట్లు (119.70 కోట్లు గ్రాస్) రూ.78 కోట్లు, తమిళం రూ.35.85 కోట్లు (రూ.70.25 కోట్లు గ్రాస్ ) రూ.27 కోట్లు,కేరళ రూ. 24.05 కోట్లు (51.45 కోట్లు గ్రాస్) రూ. 10 కోట్లు, హిందీ+రెస్టాప్ భారత్ రూ.169.35 కోట్లు (రూ.389.05 కోట్లు గ్రాస్) రూ.100 కోట్లు ఓవర్సిస్ రూ.78.30 కోట్లు (రూ.153.40 కోట్లు) రూ.30 కోట్లు .. ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు రూ.466.25 కోట్లు (రూ.942.75 కోట్ల గ్రాస్) వసూళ్లను చేసింది. ఓవరాల్‌గా 13వరోజు బాక్సాఫీస్ వద్ద రూ.8.52 కోట్ల షేర్ (17.40 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది.
తెలుగులో ఈ సినిమా రూ.78 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ.79 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. 13 రోజులలో రూ.75.45 కోట్లు (రూ.121.30 కోట్ల గ్రాస్) వసూలు రాబట్టింది. టోటల్‌గా రూ.466. 25 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 13 రోజుల్లో రూ.466. 25 కోట్ల షేర్ వసూలు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఏపీలో ఒక్క ఏరియాలో కూడా బ్రేకు ఈవెన్ కాలేదు. కర్ణాటకలో బ్రేకు ఈవెన్‌కు రూ.16.75 కోట్ల దూరంలో ఉంది. హిందీలో మాత్రం అంచనాలకు మించి వసూళ్లు రావడమే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. మొత్తానికి ఈ సినిమా రూ.119.25 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాలి మరి.
Also Read :
గ్రామ దేవతలు రాత్రి పూట సంచారం చేస్తారా..!!
ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, ఆచార్యలో కాజల్ లకు అన్యాయం..? మెగాఫ్యామిలీ పై దారుణమైన ట్రోల్స్..!