Home » వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నుంచి గ్రూప్ కాల్స్ లో ఎంత మంది మాట్లాడుకోవచ్చంటే..?

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక నుంచి గ్రూప్ కాల్స్ లో ఎంత మంది మాట్లాడుకోవచ్చంటే..?

by Anji
Ad

ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్ ఏదైనా ఉందా? అంటే ఠక్కున గుర్తుకొచ్చే పేరు వాట్సాప్. ప్రతీ ఒక్క స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ఉండాల్సిందే. యూర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. వాట్సాప్ కి ఈ స్థాయిలో క్రేజ్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా మరో లేటెస్ట్ అప్డేట్ తో  యూజర్లను అట్రాక్ట్ చేసే పనిలో పడింది వాట్సాప్. ఇంతకు ఆ అప్డేట్ ఏంటి..? దాని ఉపయోగం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

వాట్సాప్ లో ఎక్కువగా ప్రాముఖ్యత పొందిన ఫీచర్స్ లో గ్రూప్ కాల్స్ ఒకటి. ఎక్కడెక్కడో ఉన్న వారందరూ ఒకచోట చేరి ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుకునే సదుపాయం ఈ ఫీచర్ ద్వారా యూజర్లకు అందించింది వాట్సాప్. ఇప్పటి వరకు ఈ గ్రూప్ కాల్స్ లో ఒకేసారి 15 మంది యూజర్లు కలిసి మాట్లాడుకునే అవకాశం ఉందని తెలిసిందే. తాజాగా వాట్సాప్ ఇందులో కొత్తగా ఓ అప్డేట్ తీసుకొచ్చింది. 

Advertisement

వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త అప్డేట్ లో ఇక నుంచి వాట్సాప్ గ్రూపు కాల్స్ లో ఎక్కువగా 31 మంది పాల్గొనే అవకాశం లభించనుంది. దీంతో ఒకేసారి 31 మంది గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవచ్చన్నమాట. కాల్స్ ట్యాబ్ కి అప్డేట్ తో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతానికి 2.23.19.16 బీటా టెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్ లో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే.. యూజర్ల ప్రైవసీకి పెద్ద పీట వేస్తున్న వాట్సాప్ ఇందులో భాగంగా మరో కొత్త ఫీచర్ ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగంగా బీటా టెస్టర్లకు ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్ కోసం ఆటోమేటిక్ సెక్యూరిటీ కోడ్ వెరిఫికేషన్ ఫీచర్ తీసుకురానుంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఇంట్లో పెట్టుకునే వినాయకుడి విగ్రహానికి తొండం ఏ దిశలో ఉండాలో తెలుసా ?

గర్భిణులు గ్రీన్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా ?

Visitors Are Also Reading