Home » మెగాస్టార్ నుంచి అల్లుఅర్జున్ వ‌ర‌కు వారికి ఇష్ట‌మైన ఆహారప‌దార్థాలు ఇవే..!

మెగాస్టార్ నుంచి అల్లుఅర్జున్ వ‌ర‌కు వారికి ఇష్ట‌మైన ఆహారప‌దార్థాలు ఇవే..!

by Anji
Ad

వ‌య‌స్సు పెరుగుతున్న కొద్ది స్టార్ హీరోలంద‌రూ ఎప్పుడూ ఒకే ర‌క‌మైన ఫిట్‌నెస్‌తో క‌నిపిస్తుంటారు. ముఖ్యంగా నాగార్జున అయితే ఇంకా య‌వ్వ‌నంగా క‌నిపిస్తుటారు. ఇందుకు కార‌ణం వాళ్లు తీసుకునే ఆహారం అనే చెప్పాలి. మ‌రీ తినే ఆహారంలో ఎన్నో జాగ్ర‌త్తలు తీసుకునే హీరోల‌తో ఏ హీరో ఏ వంట‌ల‌ను ఇష్టంగా తింటారో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

 

మెగాస్టార్ చిరంజీవి:

మెగాస్టార్ కి చేపల పులుసు, రొయ్యల వేపుడు, అంటే బాగా ఇష్టమ‌ట. సీ ఫుడ్ తో పాటు చిరంజీవి దోశ‌లను కూడా చాలా ఇష్టంగా తింటారు.

నందమూరి బాలకృష్ణ:

బాలయ్య బాబు కూడా రొయ్యలను బాగా ఇష్టపడతారట‌. అదేవిధంగా చికెన్ బిర్యానీ కూడా బాలయ్యకి ఫేవరెట్. అయితే ఏ ప్రాంతానికి వెళ్తే.. ఆ ప్రాంతం ఫుడ్ ని ఆస్వాదించడం బాలయ్యకి అలవాటు.

ఇది కూడా చ‌ద‌వండి :  KRISHNAM RAJU : త‌న‌కు తానే శిక్ష వేసుకున్న రెబ‌ల్ స్టార్.. ఎందుకో తెలుసా..?
విక్టరీ వెంకటేష్:

వెంకటేష్ నోస్టాలజిక్ కీమాను ఎక్కువగా ఇష్టపడతారు. అదేవిధంగా వేడిగా ఉండే అన్నంలో నెయ్యిని కలుపుకొని నోస్టాలజిక్ కీమాను తినడమంటే వెంకటేష్ కు బాగా ఇష్టమట.

కింగ్ నాగార్జున:

ఆరు పదుల వయసులో కూడా అందంగా కనిపించే నాగార్జున దోశ, చేపలు, గ్రిల్ట్ చికెను ఎంతో ఇష్టంగా తింటారు.

ప్రభాస్:

Advertisement

ప్రభాస్ కు ఇష్టమైన ఫుడ్ బిర్యాని. సీ ఫుడ్ తో పాటు రోడ్ సైడ్ పాని పూరిని కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారు.

మహేష్ బాబు :

మహేష్ వాళ్ళ అమ్మమ్మ గారు చేసే ప్రతి వంటనూ ఎంతో ఇష్టంగా తినేవారు. ప్రస్తుతం మహేష్ ఇష్టమైన వంటకాలను కూడా డైటీషియన్ సలహాల ప్రకారమే తీసుకుంటున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్:

పవన్ కళ్యాణ్ కి బాగా ఇష్టమైన వంటకం నెల్లూరు చేపల పులుసు, అలాగే పప్పు, లెమన్ రైస్, అరటికాయ వేపుడు, నాటుకోడి పులుసును కూడా పవన్ ఎంతో ఇష్టంగా తింటారు.

ఇది కూడా చ‌ద‌వండి :  KRISHNAM RAJU : కృష్ణంరాజు ఆస్తులు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయి..? వాటి విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

జూనియర్ ఎన్టీఆర్:

జూనియర్ ఎన్టీఆర్ ఫుడ్ లవర్ తో గ్రేట్ చెఫ్ కూడా. ఇక ఎన్టీఆర్ కి ఇష్టమైన ఫుడ్.. రోటి, నాటుకోడి కీమా, అలాగే ఎన్టీఆర్ బిర్యానీని కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

రామ్ చరణ్:

రామ్ చరణ్ కూడా బిర్యానీ నే ఇష్టపడతారు. అలాగే చిరంజీవి దోశ ని కూడా చరణ్ ఇష్టంగా తింటారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్:

స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ప్రమోట్ అయినా అల్లు అర్జున్ కి వాళ్ళ అమ్మగారు చేసే వంటలే ఫేవరెట్. అయితే, బన్నీ బిర్యానీని ఇష్టంగా తింటారు.

 

ఇది కూడా చ‌ద‌వండి : PRABHAS WITH KRISHNAM RAJU: ప్ర‌భాస్ ఆ సినిమా చేస్తే చూడాల‌ని ఉంద‌న్న కృష్ణంరాజు

Visitors Are Also Reading