ప్రతి ఒక్కరు తమ జీవితంలో దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేయనివారు అంటూ ఎవరు ఉండరేమో. ఏదో ఒక అవసరం మీదనో బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కొంతమందికి జర్నీ అంటే చాలా ఇష్టం ఉంటుంది. మరికొంతమందికి మాత్రం అస్సలు ఉండదు. జర్నీ అంటేనే భయపడిపోతుంటారు. దీనికి కారణాలు ఉన్నాయి.
Advertisement
జర్నీ చేస్తే ఎక్కడ వాంతులు అవుతాయేమో అని భయపడిపోతుంటారు. కొందరికి బస్సులు, ఇంకొందరికి కార్లు, మరికొందరికి రైళ్లలో ప్రయాణం చేస్తే వాంతులు అవుతాయి. ఈ కారణంగానే ప్రయాణాలు అంటే భయపడిపోతుంటారు. కాబట్టి ఇలాంటివారు ప్రయాణాన్ని అస్సలు ఇష్టపడరు. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటే ప్రయాణంలో ఈ మూడు వస్తువులను మీ బ్యాగులో ఉంచుకోవడం మంచిది.
READ ALSO : Mahesh Babu : దుబాయ్ లో కోట్లు పెట్టి… విల్లా కొన్న మహేష్ బాబు!
# నిమ్మకాయ
Advertisement
మీ వస్తువులతో పాటు నిమ్మకాయను తప్పనిసరిగా ఉంచుకోవాలి. వాంతుల సమస్య పెరిగినప్పుడు దాని రసాన్ని లేదా వాసన చూడాలి. అలాగే నిమ్మకాయను వాటర్ బాటిల్లలో కూడా ఉంచుకోవచ్చు. ఇది ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది.
READ ALSO : Chikoti Praveen: థాయ్‌లాండ్ పోలీసులకు చిక్కిన చికోటి ప్రవీణ్.. ఇతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?
# అరటిపండు
మామూలుగా అందరూ అరటిపండు తింటూనే ఉంటుంటారు. కానీ ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా అరటిపండును మీ బ్యాగులో పెట్టుకుంటే మంచిది. ఈ పండు పొటాషియం పునరుద్ధరించే గుణం కలిగి ఉంటుంది. వాంతుల నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది.
# అల్లం
అల్లం వంటకాల రుచిని పెంచడానికి ఉపయోగించే ఒక మసాలా. ఇది ప్రయాణంలో వాంతుల సమస్యకు కూడా మంచిగా పనిచేస్తుంది. సమస్య పెరిగినప్పుడు పచ్చి అల్లాన్ని నమిలితే చాలా ఉపశమనం కలుగుతుంది.
READ ALSO : IPL 2023 : ప్రతీకారంతో కొట్టుకున్న కోహ్లీ, గంభీర్.. వీడియో వైరల్