తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల కోసం అనేక పధకాలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా మహిళల కోసం ఆయన మహాలక్ష్మి అనే పధకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పధకంలో మహిళలందరికీ ఆర్టీసీ బస్సు ఉచితం అని పేర్కొన్నారు. అయితే.. ఈ పధకం ప్రవేశ పెట్టినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరిగే మహిళలు ఎక్కువ అయ్యారు అని ఆర్టీసీ బస్సు అధికారులు సైతం పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ఈ పథకం అమలులోకి వచ్చిన తరువాత గతంలో కంటే మహిళలు ఆర్టీసీ బస్సుని ఎక్కువగా వాడుతున్నారని తేలింది. అయితే.. ఈ స్కీం ద్వారా మహిళలు ఏయే ప్రదేశాల్లో తిరుగుతున్నారు అనే విషయాన్ని తెలుసుకుని అందరు ఆశ్చర్యపోతున్నారు. ఈ పధకం వచ్చిన తరువాత ఎక్కువ మంది మహిళలు దైవ దర్శనాలు చేసుకోవడానికి వెళ్తున్నారు అని అధికారులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా నుంచి వేముల వాడ, హైదరాబాద్, కాళేశ్వరం వంటి క్షేత్రాలకు ఎక్కువగా వెళుతున్నట్లు గుర్తించారు.
డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి ఈ పధకాన్ని అమలు లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి మొదటి రెండు రోజులు లక్ష వరకు మహిళలు ప్రయాణం చేయగా.. ఆ తరువాత రెండు లక్షలకు పైగా మహిళలు జీరో టికెట్ పై ప్రయాణం చేసారని అంటున్నారు. ప్రతి రోజు లక్షల సంఖ్యలోనే మహిళా ప్రయాణికులు ఉంటున్నారని చెబుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!