Home » చిన్నారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ఇంటి వ‌ద్ద‌నే ఉచిత ఆధార్ రిజిస్ట్రేష‌న్

చిన్నారుల‌కు గుడ్‌న్యూస్‌.. ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల‌కు ఇంటి వ‌ద్ద‌నే ఉచిత ఆధార్ రిజిస్ట్రేష‌న్

by Anji
Ad

ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు శుభ‌వార్త అని చెప్పాలి. మీ పిల్ల‌ల‌కు ఆధార్ రిజిస్ట్రేష‌న్ ఇంకా చేయించ‌లేదా..? మీరు ఆధార్ కేంద్రాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఇంటి వ‌ద్ద‌కే వచ్చి పిల్ల‌ల వివ‌రాల‌ను న‌మోదు చేసారు. అది పూర్తిగా ఉచితంగా అందించ‌నున్నారు. దానికి సంబంధించిన వివ‌రాల‌ను ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.


ఐదేళ్ల‌లోపు చిన్నారుల‌కు ఉచితంగా ఆధార్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియను మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌తో క‌లిసి త‌పాలా శాఖ చేప‌ట్టింది. అంగ‌న్‌వాడి కేంద్రాల్లో న‌మోదైన ఐదేళ్ల లోపు పిల్ల‌ల ఆధార్ ఐదేళ్ల‌లోపు పిల్ల‌ల ఆధార్ వివ‌రాల‌ను పోస్ట‌ల్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఇంటి వ‌ద్ద‌నే ఉచితంగా న‌మోదు చేస్తామ‌ని హైద‌రాబాద్ రీజియ‌న్ పోస్టాఫీస్ విభాగం అసిస్టెంట్ డైరెక్ట‌ర్ వెల్ల‌డించారు. ఆధార్ కార్డు రిజిస్ట్రేష‌న్‌కు పుట్టిన తేదీ ధృవ‌ప‌త్రం ఉంటే స‌రిపోతుంద‌ని త‌పాలాశాఖ వెల్ల‌డించింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని త‌పాలా కార్యాల‌యాల్లో ఈ సేవ‌లు అందిస్తారు. అంగ‌న్‌వాడి కేంద్రాల నిర్వాహ‌కుల‌తో ప్ర‌త్యేక శిబిరాల‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వారి అభ్య‌ర్థ‌న మేర‌కు స్థానికంగా ఉండే త‌పాలా సిబ్బంది చిన్నారుల ఇండ్ల‌కే వ‌చ్చి ఆధార్ న‌మోదు చేస్తారు అని త‌పాలాశాఖ‌కు పేర్కొంది. త‌మ ఇంటి వ‌ద్ద‌కు వ‌చ్చిన పోస్ట్‌మ్యాన్‌కు పిల్ల‌ల పుట్టిన తేదీ ధృవ‌ప‌త్రం, ఫోటో, బ‌యోమెట్రిక్ త‌దిత‌ర వివ‌రాల‌ను త‌ల్లిదండ్రులు అంద‌జేయాల‌ని వివ‌రించింది.

Advertisement

Advertisement


తెలంగాణ 1,552 మంది డాక్ సేవ‌క్‌లు, పోస్ట్ మ్యాన్‌లు, పిల్ల‌ల ఆధార్ న‌మోదు సేవ‌ల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌ను స్కూళ్ల‌లో చేర్చాల‌నుకుంటున్న త‌ల్లిదండ్రుల‌కు ఇది ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌ని ఈ సేవ‌లను అంద‌రూ వినియోగించుకోవాల‌ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, త‌పాలా అధికారులు సూచిస్తున్నారు. భార‌త‌దేశంలో నివ‌సించే వారంద‌రికీ యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇచ్చే 12 అంకెల ఐడెంటిటి కార్డు ఆధార్‌. అప్పుడే పుట్టిన పిల్ల‌ల నుంచి సీనియ‌ర్ సిటిజ‌న్ల వ‌ర‌కు అంద‌రికీ ఇస్తారు. చాలా ప్రాంతాల్లోఇది అవ‌స‌రం. ఐడెంటిటి ప్రూఫ్ మాదిరిగా అడ్ర‌స్ ప్రూఫ్ మాదిరిగా ఉప‌యోగిస్తుంటారు. అందుకే ప్ర‌తి ఒక్క‌రికీ ఆధార్ త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రం.

Also Read : 

పుష్ప చిత్రంపై హిందీ అగ్ర ద‌ర్శ‌కుడి కామెంట్స్ వైర‌ల్‌..!

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు ఒత్తిడి పెర‌గ‌కుండా చూసుకోవాలి

 

Visitors Are Also Reading