Home » ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన వంటలక్క..!!

ఆ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ కొట్టేసిన వంటలక్క..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ ఒక స్టార్ హీరో తో సినిమా చేసే ఛాన్స్ కొట్టేసింది అని చెప్పవచ్చు. అదేనండి మన వంటలక్క.. ఆ సీరియల్లో ఆమె పాత్ర ప్రకారమే ఆమెకు వంటలక్క అని పేరు వచ్చింది. ప్రేమి విశ్వనాథ్ అంటే ఎవరైనా నోరెళ్లబెడతారు. వంటలక్క అంటే మారుమూల పల్లె నుంచి రాష్ట్రవ్యాప్తంగా అందరు గుర్తిస్తారు. ఈ సీరియల్ ప్రస్తుతం దేశం లోనే టాప్ పొజిషన్ లో నడుస్తుంది. అందులో మెయిన్ రోల్ వంటలక్కదే. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో రేటింగ్ చూసుకుంటే కార్తీకదీపం సీరియల్ దూకుడు మీద ఉంది.

Advertisement

Advertisement

 

అన్ని ప్రోగ్రామ్స్ ను క్రాస్ చేసి గత రెండు సంవత్సరాలుగా నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలోనే కాస్త రేటింగ్ తగ్గినా కానీ వంటలక్క రేంజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో పెరిగింది. అంతేకాదు బడా నటులను కూడా పక్కకునెట్టి షాపింగ్ మాల్స్, పెద్ద పెద్ద ఈవెంట్స్ కు దీప వంటలక్క ను పిలుస్తున్నారు అంటే ఆమె ఆ సీరియల్ తో ఎంతో గుర్తింపు సంపాదించిందో చెప్పవచ్చు. కానీ ఈమెకు ప్రస్తుతం బాలయ్య చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చింది.బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం లో నటించే

ఆఫర్ వచ్చింది. మరి వంటలక్క ఓకే చెబుతుందా లేదా అనేది చూడాలి. ఇప్పటి వరకు బుల్లితెరపై అలరించిన ప్రేమి విశ్వనాథ్, సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజిలో అలరిస్తుందో చూడాలి. ఏది ఏమైనా సీరియల్ లో వంటలక్క పాత్ర మాత్రం ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆమె పాత్ర తో సీరియల్ కి గొప్ప పేరు వస్తుందని అంటున్నారు.

Visitors Are Also Reading