Home » దివ్యభారతి మరణానికి.. ఈ తెలుగు సినిమాకు లింకుందా..?

దివ్యభారతి మరణానికి.. ఈ తెలుగు సినిమాకు లింకుందా..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో కుర్ర కారుకు చెమటలు పట్టించిన హీరోయిన్ దివ్యభారతి.. చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె 19 ఏళ్ల వయసు లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఇక 19 ఏళ్ల వయసులోనే అనుకోకుండా మరణించింది.. అయితే ఆమె మరణానికి ఒక సినిమాకు మధ్య లింకు ఉందని ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి.. మరి ఆ లింక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దివ్యభారతి కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ చూసిన దాసరి నారాయణరావు ఆమెతో ఒక మూవీ చేయాలని అనుకున్నారు. అనుకున్న విధంగానే చింతామణి చిత్రాన్ని చేశారు.. గతంలో రంగస్థలంపై వేలాది ప్రదర్శనలు ఇచ్చిన నాటకం. ఇది రెండుసార్లు సినిమాగా కూడా వచ్చింది. ఇందులో చింతామణి పాత్ర గురించి తెలిసి దివ్యభారతి అందులో నటించాలని ముచ్చట పడింది. 1992లో చింతామణి షూటింగ్ కూడా మొదలైంది. ఇక డేట్ ల సర్దుబాటు ప్రక్రియలో దివ్యభారతి మునిగిపోయారు. కానీ రెగ్యులర్ షూటింగ్ ఇంకా మొదలు పెట్టక ముందే దివ్యభారతి ఆకస్మికంగా మరణించారు.

దీంతో ఆ మూవీ అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత ఈ చిత్రాన్ని మరొకరితో తీయాలని దాసరి పై ఒత్తిడి పెరిగింది. కానీ దాసరి దానికి ఒప్పుకోలేదు. ఇది దివ్యభారతి మనసు పెట్టుకున్న సినిమా.. దీన్ని తీయాలని అనుకుంటే ఆమెతోనే అంటూ పక్కన పెట్టేసారు. బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన దివ్యభారతి రెండు సంవత్సరాలు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. నాగార్జున తప్ప అందరూ అగ్ర హీరోలతో నటించింది. అలా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దివ్యభారతి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.

also read:

Visitors Are Also Reading