Home » వీటిని రెగ్యులర్ గా తీసుకోండి… ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి…!

వీటిని రెగ్యులర్ గా తీసుకోండి… ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి…!

by Sravya
Ad

ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటారు. ఎముకలని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం. వయసు పెరిగే కొద్ది ఎముకల్లో మార్పులు కలుగుతాయి ఎముకలు బలహీనమైపోతాయి. ఎముకల ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని కచ్చితంగా తీసుకోవడం మంచిది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉండడం వలన ఎముకలను ఇది బలంగా మారుస్తుంది. యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు కూడా పసుపులో ఉంటాయి పసుపును తీసుకుంటే ఎముకలు బలంగా మారుతాయి. అశ్వగంధని తీసుకుంటే కూడా ఎముకలు బలంగా మారుతాయి. ఆర్థరైటిస్ నొప్పిని అశ్వగంధ ఈజీగా తగ్గిస్తుంది.

Advertisement

Advertisement

కండరాలని దృఢంగా మారుస్తుంది వేడి పాలల్లో అశ్వగంధ పొడి వేసుకుని తీసుకుంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అల్లం తీసుకుంటే కూడా ఎముకలు బాగుంటాయి. అల్లంని ఆహారంలో భాగం చేసుకోండి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. త్రిఫల కూడా ఆరోగ్యానికి మంచిది. మూడు మూలికల మిశ్రమంతో తయారు చేసిన త్రిఫల తీసుకోవడం వలన కీళ్లు ఆరోగ్యం గా ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ ఈజీగా బయటికి పంపిస్తుంది ఆపిల్ సైడర్ వెనిగర్. కీళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఆపిల్ సైడర్ వెనిగర్ ని కూడా వాడుతూ ఉండండి. ఇలా వీటిని మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఎముకలు బలంగా మారుతాయి దృఢంగా ఉంటాయి.

Also read:

Visitors Are Also Reading