Home » పిల్ల‌లు భూతులు మాట్లాడ‌టానికి 5 కార‌ణాలు..మాట్లాడ‌కుండా ఉండాలంటే ఇలా చేయండి..!

పిల్ల‌లు భూతులు మాట్లాడ‌టానికి 5 కార‌ణాలు..మాట్లాడ‌కుండా ఉండాలంటే ఇలా చేయండి..!

by AJAY
Ad

పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో ఎక్కువ‌గా మొక్కై వంగ‌నిదే మానై వంగునా అనే సామెత‌ను వాడుతుంటారు. ఆ సామెత‌ను మానసిక నిపుణులు కూడా ఒప్పుకుంటారు. చిన్నవ‌య‌సులో పిల్ల‌లు ఎలాంటి వాతావ‌ర‌ణంలో ఎలాంటి ప్ర‌వ‌ర్త‌న‌తో పెరుగుతారో అలాంటి ప్ర‌వ‌ర్త‌నే జీవితాంతం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబ‌ట్టి చిన్న వ‌య‌సులోనే పిల్ల‌ల‌కు మంచి చెడులు నేర్పించాలి.

Advertisement

అయితే ముఖ్యంగా చిన్న పిల్ల‌ల‌తో త‌ల్లిదండ్ర‌ల‌కు ఉండే స‌మ‌స్య‌ల‌లో భూతులు మాట్లాడ‌టం కూడా ఒక‌టి. ఇంట్లో వాళ్ల‌ను చూసో లేదంటే త‌మ చుట్టు ప‌క్క‌న వాళ్ల‌ను చూసో పిల్ల‌లు భూతులు మాట్లాడ‌టం నేర్చుకుంటారు. కాగా పిల్ల‌లు భూతులు మాట్లాడ‌టం మానేయ‌డానికి మాన‌సిక నిపుణులు కొన్ని స‌ల‌హాలు సూచ‌న‌లు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం….ఏది వింటున్నామో అదే పిల్లలు మాట్లాడుతుంటారు.

Also Read:  గూగుల్ క్రోమ్ లో వచ్చిన కొత్త ఫీచర్ గురించి మీకు తెలుసా ?

Advertisement

Kids on a school break drinking milk

ఇంట్లో వాళ్లు ప‌నివాళ్ల‌తో లేదంటే ఇంట్లో వాళ్లే గొడ‌వ పెట్టుకుని భూతులు మాట్లాడుతుంటే ఆ భూతుల‌ను పిల్ల‌ల‌ను నేర్చుకుని వాళ్లు కూడ ఆమాట్లాడుతుంటారు. కాబ‌ట్టి ఇంట్లో వాళ్లు భూతులు మాట్లాడ‌కుండా చూసుకోవాలి. అంతేకాకుండా ప్ర‌స్తుతం కొన్ని సినిమాల‌లో భూతులు ఎక్కువ‌గా ఉంటున్నాయి. సినిమాల్లో మాట్లాడ‌కూడ‌ని భూతుల‌ను మాట్లాడుతున్నారు.

kids parents

కాబ‌ట్టి అలాంటి సినిమాల‌కు పిల్ల‌ల‌ను దూరంగా ఉంచాల‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా పిల్ల‌లు వారి వ‌య‌సు వారితోనే గ‌డుపుతుంటారు. కాబ‌ట్టి పిల్ల‌ల స్నేహితుల‌లో భూతులు మాట్లాడే వాళ్లు ఉంటే వారికి దూరంగా ఉంచ‌డానికి ప్ర‌య‌త్నించాలి. అంతే కాకుండా పిల్ల‌లు భూతులు మాట్లాడేట‌ప్పుడు త‌ల్లిదండ్రులు గ‌మ‌నిస్తే అవి గొప్ప ప‌దాలు కాదు అలా మాట్లాడితే స‌మాజం లో చీప్ గా చూస్తారు అని కూర్చోబెట్టి వివ‌రంగా చెప్పాల‌ని మాన‌సిక నిపుణులు చెబుతున్నారు.

Also Read:  నటి హేమ భర్త ఎలా ఉంటారో…ఏం చేస్తారో తెలుసా…ఫ్యామిలీ ఫోటోలు వైరల్…!

Visitors Are Also Reading