పిల్లలను ఎంత బాగా పెంచితే తల్లిదండ్రులకు అంత బాగా పేరు వస్తుంది. పిల్లల పెంపకంలో లోపం ఉంటే దానికి కారణం తల్లిదండ్రులదే అంటుంటారు. అటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు తమ పిల్లలతో తెలివిగా ప్రవర్తించడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారో వారి పిల్లలు అదేవిధంగా ప్రవర్తిస్తుంటారు. మీరు పిల్లలకు మెరుగైన సంరక్షణను అందించాలనుకుంటే మీ మధ్య మంచి ప్రవర్తనను కొనసాగించాలి. ఇది మాత్రమే కాదు అన్ని సమయాల్లో పిల్లల పట్ల కఠినంగా ప్రవర్తిస్తే ఆ తరువాత పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచి విషయాలను దాయడం నేర్చుకుంటారు. ఏ తప్పుల వల్ల పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దూరం అవుతారో తెలుసుకుందాం.
Advertisement
పిల్లలు మీతో మాట్లాడాలనుకుంటే వారికి మాటలను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. మీరు సంభాషణ సమయంలో ల్యాప్‌టాప్ లేదా మొబైల్ ని ఉపయోగిస్తుంటే మీరు వారి మాటలను సీరియల్‌గా తీసుకోవడం లేదని వారికి అనిపిస్తుంది. ఇలా చేయడం ద్వారా వారు మీ నుంచి దూరం జరగడం ప్రారంభిస్తారు
పిల్లలకు వారి తల్లిదండ్రులే సర్వస్వం. అటువంటి పరిస్థితిలో పిల్లలకు మీ అవసరం వచ్చినప్పుడే వారిని ప్రోత్సహించడానికి మీరు నిలబడాలి. లేదంటే పిల్లలు డిప్రెషన్లోకి వెళ్లిపోతారు లేదా కోపంగా ఉంటారు. ఇది మాత్రమే కాదు. వారి మనస్సులో విచారం, కోపం తలెత్తుతాయి. జీవితాంతం మీ నుంచి దూరం ఉంచడానికి కారణం కావచ్చు.
Advertisement
పిల్లల పెంపకంలో తప్పులను సరిదిద్ధడం అవసరం కానీ మీరు వారితో తప్పుగా ప్రవర్తించారని లేదా వారిని నిరంతరం మందలించాలని దీని అర్థం కాదు. అలా చేయడం వల్ల వారు తిరుగుబాటు, కోపం తెచ్చుకోవచ్చు.
మీరు వారిని ఇతరులతో పోల్చడం లేదా పిల్లల పట్ల ఎల్లప్పుడు వివక్ష చూపడం వంటివి చేస్తే మీరు వారికి విలువ ఇవ్వరు అని వారు గ్రహిస్తారు. వారి మనసులో మీ పట్ల కోపం పుట్టిస్తుంది. దీంతో మీ నుంచి దూరం పెరుగుతుంది.
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల మాటలను చెప్పనివ్వరు. వారు ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు వేసి, నిర్థారణకు వస్తే అది పిల్లల మనస్సును క్లియర్ చేస్తుంది. దీనికోసం మీరు వారి పాయింట్‌ను పూర్తిగా వినడానికి వారికి అవకాశమివ్వాలి.
Also Read :
నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. తమను మోసం చేశారంటూ కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు
ఆ స్టార్ హీరోకు కళ్యాణ్‌రామ్ భార్య స్వాతి వీరాభిమాని అంట..ఇంతకు ఆ హీరో ఎవరంటే..?