Home » విశాల్ ఎఫ్ఐఆర్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఎలా ఉందంటే..?

విశాల్ ఎఫ్ఐఆర్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఎలా ఉందంటే..?

by Anji
Ad

కోలీవుడ్ స్టార్ హీరో విష్ణు విశాల్‌, మంజిమ మోహ‌న్ జంట‌గా మ‌ను ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం ఎఫ్ఐఆర్. మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌మ‌ర్ప‌ణ‌లో అభిషేక్ పిక్చ‌ర్స్ విష్ణు విశాల్ బ్యాన‌ర్ పై హీరో విష్ణు విశాల్ తెలుగులో అందిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల అయిన పోస్ట‌ర్స్‌, సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను న్యాచుర‌ల్ స్టార్ హీరో నాని విడుద‌ల చేశారు.

Advertisement

ఈ ట్రైల‌ర్ ఆద్యంతం ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఐఎస్ఐ టెర్ర‌రిజ‌మ్ నేప‌థ్యంలో సాగే క‌థ‌గా ట్రైల‌ర్‌ను ఓపెన్ చేసారు. టెర్ర‌రిజం పెర‌గాల‌ని బాంబు బ్లాస్ట్లు చేసే ఓ వ్య‌క్తి కోసం పోలీసులు వెతుకుతుంటారు. అయితే క‌రుడు గ‌ట్టిన టెర్ర‌రిస్ట్‌.. హీరోనే అనుకొని అత‌న్నీ ఫాలో అయి ఒకానొక ద‌శ‌లో అరెస్ట్ చేస్తారు. అప్ప‌టివ‌ర‌కు ఎంతో హ్యాపీగా ఉన్న అత‌డి జీవితం త‌ల‌కిందుల‌వుతుంది. అమాయ‌కుడు రివేంజ్ తీర్చుకోవ‌డానికి నిజంగానే టెర్ర‌రిస్ట్‌గా మారి పోలీసుల‌ను ముప్పు తిప్ప‌లు పెడ‌తాడు.

Advertisement

పోలీసులు వెతుకుతున్న అస‌లు క‌రుడు గ‌ట్టిన టెర్ర‌రిస్ట్ ఎవ‌రు..? అత‌నికి,హీరోకు ఉన్న సంబంధం ఏమిటి..? చివ‌ర‌కు హీరో నిర్దోషి అని నిరూపించుకున్నాడు..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే..ఇక అమాయ‌కుడిగా.. టెర్ర‌రిస్ట్‌గా విష్ణు విశాల్ న‌టన అద్భుత‌మని చెప్పాలి. పోలీస్ గా గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్‌, మంజిమ మోహ‌న్ లాయ‌ర్‌గా క‌నిపించి మెప్పించారు. ఇక మ‌రొక హీరోయిన్ రెబా మెనికా జాన్ కూడా అద్భుతంగా న‌టించింది. టెర్ర‌రిజ‌మ్ కార‌ణంగా ఓ అమాయ‌కుడు ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను ఈ సినిమాలో చూపించారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఫిబ్ర‌వ‌రి 11న విడుద‌ల కానున్న‌ది. ఈ సినిమాతో మ‌రి విష్ణు మ‌రొక హిట్‌ను అందుకొని ర‌వితేజ కూడా హిట్ అందిస్తాడేమో చూడాలి.

Also Read : సొంతింటిని అమ్మిన అమితాబ్‌.. కార‌ణం ఏమిటో..?

Visitors Are Also Reading