Telugu News » Blog » సొంతింటిని అమ్మిన అమితాబ్‌.. కార‌ణం ఏమిటో..?

సొంతింటిని అమ్మిన అమితాబ్‌.. కార‌ణం ఏమిటో..?

by Anji
Ads

బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న సొంతింటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలో ఉన్న ఆ ఇంటికి సోఫాన్ అని పేరు పెట్టిన అమితాబ్ ఆయ‌న చిన్న‌త‌నం మొత్తం అక్క‌డే గ‌డిపారు. హీరో కావాల‌ని ముంబైలో అడుగు పెట్టే వ‌ర‌కు త‌ల్లిదండ్రులు హ‌రివంశ్ రాయ్ బ‌చ్చ‌న్, తేజిబ‌చ్చ‌న్ తో క‌లిసి అక్క‌డ నివ‌సించారు. అమితాబ్ హీరోగా ఎదిగి ఎంత సంపాదించినా ఆ ఇంటిని కంటికి రెప్ప‌లా చూసుకున్నారు. అయితే తాజాగా ఆ ఇంటిని బిగ్ బీ అమ్మేశారు. నెజోన్ గ్రూపు ఆఫ్ కంపెనీ సీఈఓ అవ‌ని బ‌డెర్‌ సుమారుగా రూ.23కోట్లు వెచ్చించింద‌ని సోఫాన్ సొంతం చేసుకున్నారు. అవ‌ని బ‌డెర్, అమితాబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్‌.అయితే సోఫాన్ కు ద‌గ్గ‌ర‌లోనే అవ‌ని కుటుంబం కూడా నివ‌సించేది. దీంతో ఆయ‌న త‌న సోఫాన్ ను బాగా చూసుకుంటార‌నే న‌మ్మ‌కంతోనే బిగ్ బీ త‌న ఇంటిని అమ్మిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఇక ముంబైలో అమితాబ్‌కు ఐదు పెద్ద భ‌వ‌నాలు ఉన్న విష‌యం తెలిసిందే. జ‌న‌క్‌, జ‌ల్సా, ప్ర‌తిక్ష‌, వ‌త్స‌, అమ్మ వాటి పేర్లు వీటిలో ఒక బంగ్లాలోనే బాలీవుడ్ హీరోయిన్ కృతిస‌న‌న్ అద్దెకుంటుంది. అయితే అస్స‌లు సొంత ఇంటిని అమ్మాల్సిన అవ‌స‌రం అమితాబ్‌కు ఏమి వ‌చ్చింది అని ప‌లువురు ఆరా తీస్తున్నారు.

Ads
Ads

Also Read : మహేష్ బాబు పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన బాలయ్య బాబు