ప్రముఖ సినీ నటి అర్చన గురించి అందరికీ తెలిసిందే. అందంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటి ఎందుకో ఏమో కానీ అంతగా పేరు సంపాదించుకోలేకపోయింది. తెలుగులోనే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది. ఈమె బిగ్‌బాస్ రియాల్టీ షోలో కూడా పాల్గొవతా. అర్చన మొదటి సారి 2004లో తపన సినిమాతో పరిచయం అయింది. ఆ తరువాత నేను కొంచెం టచ్‌లో ఉంటే చెబుతాను. సూర్యం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, శ్రీరామదాస్, పౌర్ణమి, యమదొంగ వంటి చాలా సినిమాల్లో నటించింది. 2021లో అవలంబిక అనే చిత్రంలో కూడా నటించి ఓ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అర్చన కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా ఈటీవీలో ఆలీతో సరదాగా కార్యక్రమానికి భర్త జగదీశ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ కెరీర్, పెళ్లి పలు విషయాలను పంచుకున్నారు.
Advertisement
మ్యారేజ్ అయిన తరువాత కొన్ని పద్దతులను మనం మార్చుకుంటాం. మీరు ఇద్దరూ ఏం మార్చుకున్నారని ఆలీ అర్చన, జగదీశ్ దంపతులను అడిగారు. అందుకు అర్చన ఏమి మార్చలేదనే సమాధానం చెప్పింది. ఎక్సర్‌సైజ్, డైట్, వంటివి ప్రారంభించాం. పెళ్లి అయిన ఏడాది పాటు కరోనా జోన్‌లో ఉన్నాం. వాస్తవానికి మా పెళ్లి సమయంలో పీరియడ్స్ టైమ్‌లో ఉన్నాను. నాకు టెన్షన్ పట్టుకుంది. పెళ్లి సమయానికి పీరియడ్స్ టైమ్ అంటే నేను ఏమి చేయాలో అర్థం కాలేదు. పెళ్లి జరిగేటప్పుడు పూజలు, పురస్కారాలు, వ్రతాలు వంటివి ఉంటాయి. డేట్స్ పోస్ట్‌పోన్ కావడానికి టాబ్లెట్‌వేసుకున్నాను. లాస్ట్ మినిట్స్‌లో తీసుకుంటున్నావు చాలా ఎక్కవ తీసుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి తరువాత అని డాక్టర్ ముందే చెప్పారు. నేను హెవీ వర్కవుట్ చేయడం వల్ల కాస్త సమస్య తక్కువ అయింది.
Advertisement
ఆడవారు వాళ్ల బాడీస్‌తోటి స్పెసల్‌గా పీరియడ్స్‌ను ఆపేందుకు ఎప్పుడు ప్రయత్నించకూడదు. నేను టాబ్లెట్ తీసుకున్న తరువాత సంవత్సరం వరకు ఇబ్బంది పడ్డాను. హార్మోన్ ఇన్ బాలెన్స్ ఏమిటనేది నాకు అప్పటివరకు తెలియదు. ప్రతిరోజు చలి, జ్వరం, చాలా వీక్‌గా ఉండేదానిని. నన్ను అలా చూసి నా భర్త జగదీశ్ చాలా సందర్భాల్లో అవి ఆసమయంలో ఎందుకు తీసుకున్నావు. పెళ్లి పోస్ట్‌ఫోన్ చేసుకునేవాళ్లం కదా. నా ఆరోగ్యం కోసం జగదీశ్ కూడా చాలా కేర్ తీసుకున్నారు. సంవత్సరం తరువాత నా ఆరోగ్యం కుదటపడింది. ఇది ఎవ్వరికీ తెలియదు. ఆడవాళ్లు ఎప్పుడూ ఎంత సెన్సిటివ్‌గా ఉంటుందనేది తెలియదు.
అదేవిధంగా ఆలీ బాలయ్య బాబుకు కొరియోగ్రఫీ తీశారట అని అడగ్గా..? రాఘవేంద్రరావు గారి పాండురంగడు సినిమాలో అప్పుడే వచ్చిన నాకు సీతా రా ఇది కొరియోగ్రఫీ చేయి అని చెప్పారు. తొలుత నేను నమ్మలేదు. ఆ తరువాత చేయమని చెప్పారు రాఘవేంద్రరావు. నేను డ్యాన్స్‌కి సంబందించిన స్టెప్స్ వివరిస్తుంటే బాలకృష్ణ నేర్చుకున్న తీరు.. ఆయన అంకిత భావం నన్ను ఆశ్చర్యపరిచింది. బాలకృష్ణ లాంటి పెద్ద హీరోకి, మంచి డ్యాన్సర్‌కి కొరియోగ్రఫీ చేయడం గొప్ప అనుభవం. పెద్ద సినిమాల్లో ఎప్పుడైనా అవకాశం వచ్చిందా..? లాస్ట్ మినిట్ డ్రాప్ అయినా సినిమాలు ఏమైనా ఉన్నాయా అని ఆలీ ప్రశ్నించగా.. అర్చన ఎమోషనల్ అవుతూ సమాధానం చెప్పింది. నేను ఎవరిమీద కంప్లీట్ చేయలేదు. నాకు జరిగిన అనుభవాన్ని మాత్రమే పంచుకుంటాను.
రెండు చిత్రాల్లో అవకాశం చేజారిపోయింది. చాలా మంచి చిత్రాలు అవి. నువ్వు వస్తానంటే నేనొద్దంటానా సినిమాలో ఒక క్యారెక్టర్ రోల్ చేస్తున్నందుకు నన్ను అకస్మాత్తుగా ఓ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. ఇంకొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. డేట్స్ కూడా తీసుకొని తొలగించారు చాలా బాధ గా అనిపించింది. మొన్నటికి మొన్న ఓ వెబ్ సీరిస్‌లో కూడా ఇలాగే జరిగింది. నేను ఇక్కడే ఉన్నాను ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా మంచి ప్రాజెక్ట్ తప్పకుండా వస్తాయని చెప్పుకొచ్చింది నటి అర్చన.
Also Read :
నువ్వేకావాలి సినిమా హీరోయిన్ రిచా గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?