Telugu News » Blog » నువ్వేకావాలి సినిమా హీరోయిన్ రిచా గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

నువ్వేకావాలి సినిమా హీరోయిన్ రిచా గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా..?

by AJAY
Ads

కొంతమంది హీరోయిన్ లు త‌క్కువ సినిమాలే చేసినా ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర‌వేసుకుంటారు. ఆ లిస్ట్ లో నువ్వే కావాలి సినిమా హీరోయిన్ రిచా ప‌ల్లోడ్ కూడా ఉంటారు. నువ్వే కావాలి, చిరుజ‌ల్లు సినిమాల‌తో రిచా టాలీవుడ్ ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌ర‌య్యారు. ముఖ్యంగా నువ్వే కావాలి సినిమా బిగెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో త‌రుణ్ హీరోగా న‌టించ‌గా విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మాట‌లు రాశారు. ఈ ప్రేమ‌క‌థాచిత్రం వ‌చ్చి దాదాపుగా 20 ఏళ్లు అవుతోంది. అయిన‌ప్ప‌టికీ ఈ సినిమాకు ఇప్ప‌టికి కూడా అభిమానులు ఉన్నారు. ఈ సినిమా టీవీలో వ‌చ్చిందంటే మిస్ కాకుండా చూస్తారు. ఇక ఈ సినిమాతోనే త‌రుణ్ కు కూడా క్రేజ్ వ‌చ్చింది. అంతే కాకుండా సినిమాలో ప‌క్కింటి అమ్మాయిలా క‌నింపించిన రిచాకు కూడా ఈ సినిమాతోనే క్రేజ్ వ‌చ్చింది.

కానీ ఆ త‌ర‌వాత రిచా అడ‌ప‌ద‌డ‌పా సినిమాలు చేసి టాలీవుడ్ కు దూరమైంది. అయితే రిచా ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉంది…? ఏం చేస్తుంద‌న్న ఆస‌క్తిమాత్రం ఆమె అభిమానులకు ఉంది. రిచా నిజానికి బెంగుళూరులో జ‌న్మించింది. అంతే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గానే రిచా త‌న కెరీర్ ను మొద‌లు పెట్టింది. తెలుగు తో పాటూ త‌మిళ మ‌ల‌యాళ కన్న‌డ భాష‌ల్లో సినిమాలు చేసింది. సినిమాలు చేస్తున్న స‌మ‌యంలోనే రిచా 2011వ సంవ‌త్స‌రంలో హిమాన్షు బ‌జాజ్ ను పెళ్లి చేసుకుంది.

వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. ఇక 2016లో మ‌ళ్లీ రిచా మ‌లుపు అనే సినిమాలో న‌టించింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ సినిమాల‌కు చాలా బ్రేక్ ఇచ్చింది. ఆ త‌ర‌వాత 2020వ సంవ‌త్స‌రంలో యువ‌ర్ హాన‌ర్ వెబ్ సిరిస్ లో న‌టించి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణగా నిలిచింది. అదే విధంగా యువ‌ర్ హాన‌ర్ 2 వెబ్ సిరీస్ లో న‌టించింది. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా రిచా ప‌లు ఇంట‌ర్వ్యూలకు కూడా హాజ‌రైంది.


You may also like