Home » ఆ గొడవల వల్లే అల్లు అర్జున్ తో జక్కన్న సినిమా చేయడం లేదా..? ఆ గొడవలు ఏంటి..!

ఆ గొడవల వల్లే అల్లు అర్జున్ తో జక్కన్న సినిమా చేయడం లేదా..? ఆ గొడవలు ఏంటి..!

by AJAY
Ad

రాజమౌళి… ఇప్పుడు ఈ పేరు బ్రాండ్ గా మారిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో సినిమా వచ్చిందంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాల్సిందే అన్నట్టుగా మారిపోయింది. దానికి కారణం ఇప్పటివరకు జక్కన్న కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా ఉండకపోవడమే. ఇక రాజమౌళి టాలీవుడ్ లోని స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేస్తున్నాడు.

Advertisement

Advertisement

ఇప్పటికే రాజమౌళి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని లాంటి హీరోలతో సినిమాలు చేశాడు. అంతేకాకుండా మహేష్ బాబుతో తన తదుపరి సినిమాను రాజమౌళి అనౌన్స్ చేశాడు. అయితే టాలీవుడ్ లోని టాలెంటెడ్ హీరోలలో ఒకరు అయిన అల్లు అర్జున్ తో మాత్రం రాజమౌళి సినిమా చేయలేదు. దాంతో అల్లు అర్జున్ అభిమానులు జక్కన్న తమ హీరోతో ఎప్పుడు సినిమా చేస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో అల్లు అర్జున్ తో జక్కన్న సినిమా చేయకపోవడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మగధీర సినిమా తర్వాత అల్లు అరవింద్ తో జక్కన్న కు విభేదాలు ఏర్పడ్డాయని ఆ విభేదాల కారణంగానే అల్లు అర్జున్ తో సినిమా చేయడం లేదని టాక్ వినిపిస్తోంది.

Visitors Are Also Reading