Home » Krishna, Chiranjeevi: 1983 బాక్స్ ఆఫీస్ దగ్గర 8 సార్లు పోటీపడ్డ కృష్ణ-చిరంజీవి ఎవరు గెలిచారు ?

Krishna, Chiranjeevi: 1983 బాక్స్ ఆఫీస్ దగ్గర 8 సార్లు పోటీపడ్డ కృష్ణ-చిరంజీవి ఎవరు గెలిచారు ?

by Sravya
Ad

Krishna, Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీ లోకి వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. 150 కి పైగా సినిమాల్లో నటించి ఇప్పుడు కూడా హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు. అలానే సూపర్ స్టార్ కృష్ణ గురించి కూడా చెప్పక్కర్లేదు. కృష్ణ గారు అప్పట్లో చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఒక్కొక్కసారి ఇద్దరు హీరోల మధ్య గట్టి పోటీని మనం చూస్తూ ఉంటాము కృష్ణ, చిరంజీవి మధ్య కూడా ఒక సందర్భంలో గట్టి పోటీ జరిగింది. ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఏకంగా కృష్ణా చిరంజీవి మధ్య ఎనిమిది సార్లు పోటాపోటీ జరిగింది. మొదటిసారి బెజవాడ బెబ్బులి తో కృష్ణ ప్రేమ పిచ్చోళ్ళతో చిరంజీవి వచ్చారు.

Advertisement

వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ జరుగుతుందనుకున్నారు కానీ రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాలను ఎదుర్కొన్నాయి. 1983లో మళ్ళీ పోటీ మొదలైంది. పల్లెటూరి మొనగాడుతో చిరంజీవి ఊరంతా సంక్రాంతి సినిమాతో కృష్ణ వచ్చారు. ఊరంతా సంక్రాంతి సినిమా పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. చిరంజీవి సినిమా ఓకే ఓకే గా అనిపించింది తర్వాత అభిలాష సినిమాతో చిరంజీవి వస్తే కిరాయి కోటిగాడు సినిమాతో కృష్ణ వచ్చారు చిరంజీవి సినిమా పెద్ద హిట్ అయింది. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కృష్ణ సినిమా కూడా సూపర్ హిట్ అవడం విశేషం. రెండు సినిమాలకు కూడా కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు.

Advertisement

నాలుగో సారి అడవి సింహం సినిమాతో కృష్ణ వస్తే ఆలయ శిఖరంతో చిరంజీవి వచ్చారు అడవి సింహాలు సినిమా పెద్ద హిట్ అయింది. ఆలయ శిఖరం మాత్రం యావరేజ్ గానే నిలిచింది. తర్వాత మరోసారి సిరిపురం మొనగాడు సినిమాతో కృష్ణ రాగా శివుడు శివుడు శివుడు సినిమాతో చిరంజీవి వచ్చారు. సిరిపురం మొనగాడు సినిమా ప్రభంజనాన్ని సృష్టించింది తర్వాత అమాయకుడు కాదు అసాధ్యుడు సినిమాతో కృష్ణ వస్తే గూఢచారి నెంబర్ వన్ సినిమాతో చిరంజీవి వచ్చారు.

Also read:

రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లని రాబట్టాయి. రామరాజ్యంలో భీమరాజు సినిమాతో కృష్ణ వస్తే మోసగాడు సినిమాతో చిరంజీవి వచ్చారు. కృష్ణ పెద్ద హిట్ కొట్టారు. ఇలా చిరంజీవి కంటే కృష్ణ చాలాసార్లు హిట్ లని అందుకున్నారు. ఆఖరిగా చిరంజీవి ఖైదీ సినిమాతో హిట్ కొట్టారు. ఆ సినిమా వచ్చిన వారానికే మంత్రిగారి వియ్యంకుడు సినిమా కూడా వచ్చింది. మళ్ళీ హిట్టు కొట్టారు చిరంజీవి. ఇవి వచ్చినవారానికి కృష్ణలంక బిందువులు సినిమా వచ్చింది. పరాజయాన్ని చూడాల్సి వచ్చింది ఇలా చాలాసార్లు వీళ్ళ మధ్య గట్టి పోటీ రాగా ఎక్కువసార్లు కృష్ణ హిట్లని అందుకున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading