ఆసియా కప్ లో ఎవరు ఊహించని విధంగా మొదట ఫైనల్స్ కు చేరుకున్న శ్రీలంక జట్టు.. ఆ తర్వాత మళ్ళీ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ కప్ ను ఎగురేసుకుపోయింది. అసలు ఇండియా లేదా పాకిస్థాన్ గెలుస్తుంది.. లేదా ఆఫ్గనిస్తాన్ గెలుస్తుంది అనుకున్న ఈ టైటిల్ ను లంక ఎలా గెలవగలిగింది అనే ప్రశ్న చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ను తొలిచేస్తోంది. అయితే ఈ ప్రశ్నకు క్రికెట్ విశ్లేషకులు అందరూ ఒక్కే సమాధానం చెబుతున్నారు.
Advertisement
అదే ఫీల్డింగ్. లంక ఆసియా కప్ గెలవడానికి బ్యాటింగ్, బౌలింగ్ కంటే ఫీల్డింగ్ ప్రధానం కారణం అని అంటున్నారు. అయితే ఈ ఆసియా కప్ లో మనం చూసుకునట్లు అయితే శ్రీలంక ఫీల్డింగ్ లో ఒక్క క్యాచ్ ను కూడా డ్రాప్ చేయలేదు అనేది అర్ధం అవుతుంది. అలాగే బౌండరీ వద్ద కూడా లంక ఫీల్డర్లు చిరుతల్లా కలదిలారు. కానీ వేరే జట్లలో అది లేదు.
Advertisement
మన భారత జట్టు సూపర్ 4 లో పాక్ ఓడిపోవడానికి ముఖ్యం కారణం క్యాచ్ డ్రాప్ చేయడం. ఇక ఆఫ్గనిస్తాన్ ఫిల్డ్ర్లు కూడా కోహ్లీవి రెండు క్యాచ్చులు వదిలేసారు. పాకిస్థాన్ ఫీల్డర్లు లంకతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కూడా దూకుడు మీద ఉన్న రాజపక్స క్యాచ్ అనేది వదిలేసారు. ఇలా అన్ని జట్లు ఫీల్డింగ్ లో తలపడుతుంటే శ్రీలంక మాత్రం అద్భుతమైన ఫీల్డింగ్ చేయడం వల్లే ఈరోజు విజేతగా నిలిచింది అని అంటున్నారు.
ఇవి కూడా చదవండి :