Home » Feb 12th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Feb 12th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ప‌లు రాష్ట్రాల‌కు కొత్త గవ‌ర్న‌ర్ ల నియామకం జ‌రిగింది. ఏపీ కొత్త గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి అబ్దుల్ నజీర్ ను నియ‌మించ‌గా.. ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ మార్పు, మహారాష్ట్ర గవర్నర్‌గా రమేష్, సిక్కిం గవర్నర్‌గా లక్ష్మణ్‌ప్రసాద్, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా త్రివిక్రమ్ పర్నాయక్ లు నియ‌మితుల‌య్యారు.

సిరిసిల్ల తంగళ్లపల్లి మండలంలో చిరుత సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. గోపాల్‌పేట శివారులో లేగదూడను చిరుత చంపేసింది. వరుస ఘటనలతో స్థానికులు భ‌యాందోళ‌నకు గుర‌వుతున్నారు.

Advertisement

ఏలూరు నూజివీడు (మం) మిట్టగూడెం శివారులో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. లీలానగర్ క్రాస్‌రోడ్డు దగ్గర కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు మృ* చెందారు. తెనాలిలో పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాదానికి కారు ప్ర‌మాదానికి గురయ్యింది.

సెంట్రల్ జైలుగా సంగారెడ్డి జిల్లా జైలుగా మారింది.ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి సెంట్రల్ జైలుగా అధికారులు పేరు మార్చారు.సెంట్రల్ హోదాతో జైలు సిబ్బంది, ఖైదీల సంఖ్య పెర‌గ‌నుంది.

Advertisement

హైదరాబాద్ లోని గగన్‌పహాడ్ దగ్గర స్క్రాప్ దుకాణంలో పేలుడు సంభ‌వించింది. పేలుడు దాటికి 10 మందికి గాయాలయ్యాయి. యజమాని మహ్మద్ బాబుద్దీన్‌పై కేసు నమోదు చేశారు. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,380 గా ఉండగా…. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,600 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.72,700 గా ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండిపోవ‌డంతో వెలుపల క్యూలైన్‌లో భక్తులు ఉండాల్సి వ‌స్తుంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 75,728 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.


ఈ నెల 14న సీఎం కేసీఆర్‌. కొండగట్టు ద‌ర్శ‌నానికి వెళ్ల‌నున్నారు. ఆల‌యం అభివృద్ధికి రూ.100 కోట్లు ప్ర‌క‌టించారు. ఆలయ పునఃనిర్మాణ పనులను కేసీఆర్ ప‌రిశీలించ‌నున్నారు.

ప్రైవేట్‌ ఆస్పత్రుల పై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్న‌యం తీసుకుంది. ఆస్ప‌త్రుల‌ నియంత్రణకు కొత్తచట్టం తీసుకువ‌చ్చే ఆలోచ‌న‌లో ఉంది. ఈ విష‌యాన్ని తెలంగాణ మంత్రి హ‌రీష్ రావు వెల్ల‌డించారు.

Visitors Are Also Reading