అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమ పెళ్లి చేసుకుని వెళ్లిందని ఒక తండ్రి తీవ్ర ఆవేదన చెందారు. తన బిడ్డని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. కూతురు ప్రేమ పెళ్లి చేసుకు వెళ్ళిపోయిందని ఆమెకి శ్రద్ధాంజలి పోస్టర్ పెట్టారు. తండ్రి సిరిసిల్ల కి చెందిన చిలువేరి మురళి కూతురు 18 ఏళ్ల అనూష తన తండ్రికి తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న తన తండ్రి మురళి ఒక ఇక తన కూతురు చనిపోయిందని శ్రద్ధాంజలి పోస్టర్ని పెట్టారు. కూతురు ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని అన్నారు. మనస్తాపంతో తండ్రి చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Advertisement
Also read:
ఇక పూర్తి వివరాల్లోకి వెళితే ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురికి శ్రద్ధాంజలి పోస్ట్ పెట్టాడు. కూతుర్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు మనస్తాపంతో ఆ తండ్రి చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి మంచి కాలేజీలో చదువు చెప్పిస్తే కూతురు తనని మోసం చేసిందని మురళి బాధపడుతున్నారు. తన బిడ్డ చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతున్నారు. శ్రద్ధాంజలి పోస్టర్ని పెట్టేసి పిండ ప్రదానాలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన చిలువేరి అనూష బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది.
Advertisement
Also read:
కొద్ది రోజులుగా ప్రేమిస్తోంది. ఆ విషయం ఇంట్లో తెలిస్తే పెళ్ళికి ఒప్పుకోరు అన్న భయంతో ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి పారిపోయింది. అనూష తండ్రి మురళి తెలిసిన వాళ్ళకి బంధువులకి కూడా ఫోన్ చేసి ఆరా తీశారు. అనూష ఆచూకీ తెలీలేదు. అనూష తల్లిదండ్రులకి షాక్ ఇస్తూ ప్రేమ పెళ్లి చేసుకున్నానని చెప్పింది. కూతురు అనూష ప్రేమ పెళ్లి ఫోటో చూసి తండ్రి మురళి షాక్ అయ్యారు. కూతురు అటువంటి పని చేయదని ఆమెని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడని అనూష తండ్రి చెబుతున్నారు. శ్రద్ధాంజలి పోస్టర్ ని ఇంటి అరుగుకి అంటించి ఆవేదన చెందుతున్నారు ప్రేమ పేరుతో తల్లిదండ్రుల గుండెల మీద తన్నకండి ఇన్నాళ్లు మీకోసం తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమ ప్రేమ కాదా అని అనూష తండ్రి అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!