టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఎంతో గౌరవం ఉంది. సినీ ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్‌కి తరలిరావడంలో అక్కినేని నాగేశ్వరరావు కృషి ఉందనే చెప్పాలి. నాగేశ్వరరావు తరువాత నాగార్జున కూడా తండ్రి మాదిరిగానే సినిమాల్లో రాణిస్తూ ఆ పేరును నిలబెడుతున్నారు. ఒకప్పుడూ ఎన్టీఆర్, నాగేశ్వరరావు మాదిరిగానే.. ప్రస్తుతం చిరంజీవి, నాగార్జున ఇద్దరూ సినిమా ఇండస్ట్రీని తమ భుజాలపై మోస్తున్నారనడంల ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి ఎలాంటి కష్టం వచ్చినా వీరు ముందు ఉండి సమస్యను పరిష్కరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
ఇక నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉన్నారు. నాగార్జున కూడా తన కొడుకులకు గట్టి పోటీనే ఇస్తూ సినిమాల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. నాగార్జునపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాదంబరి కిరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున తన సినిమా స్టోరీ వినేందుకు ఏకంగా 17 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదని చెప్పుకొచ్చారు. నాగార్జున ఇటీవల మాట్లాడుతూ ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. కుర్రాళ్ల రాజ్యం అనే సినిమా తరువాత ఒక కథ చెప్పాలని ఆయన ఇంటికి వెళ్లాను. నేను చెప్పే కథ వినడానికి నాగార్జున ఏకంగా రెండున్నర గంటల సమయం కేటాయించాడు.
Advertisement
Advertisement
నాగార్జున అలా సమయం కేటాయించినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందని చెప్పాడు కిరణ్. నేను చెప్పిన కథకు నాగార్జున రెండు సీన్లను కరెక్షన్ చేయాలని సూచించాడు. కానీ 17 ఏళ్లు గడిచినా ఆ రెండు సీన్ల కరెక్షన్ మాత్రం ఇప్పటికీ ఆయన వినడం లేదు. అది నాగార్జున తప్పు కాదు.. ఎందుకంటే ఆయన చాలా బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. ఆయనకి వినడానికి సమయం లేదని చెప్పారు. బావ మూవీ ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందని ఓ ఇంటర్వ్యూలో అడిగారు. ఎందుకంటే నాగార్జునకి రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోయింది. నాగార్జునకి పల్లెటూరి టైటిల్స్ అంటే చాలా ఇష్టం అని ఇండస్ట్రీలో ఆయనను అందరూ చినబాబు అని పిలుస్తుంటారని చెప్పుకొచ్చారు.
Also Read :
నాగార్జున చెప్పడంతోనే తనని ఆ సినిమా నుంచి తొలగించారంటున్న హీరో వేణు తొట్టెంపూడి..!
అలా అనుకుంటే పార్టీలోకి రాకండి అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్..!!