Home » Family Star Collections: ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ఇంత ఘోరంగా ఉన్నాయా? విజయ్ పని అయిపోయినట్టేనా ?

Family Star Collections: ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ఇంత ఘోరంగా ఉన్నాయా? విజయ్ పని అయిపోయినట్టేనా ?

by Sravya
Ad

Family Star Collections : విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది. ఈ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లు ని రాబట్టలేకపోయింది విజయ్ ఖాతాలో ఒక డిజాస్టర్ పడింది. నిజానికి మూవీ విడుదలకి ముందు నుండి కూడా సినిమాపై హైప్ తక్కువే ఉంది. సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ కూడా తక్కువగా ఉన్నాయి మొదటి రోజు నుండి సినిమా నెగిటివ్ రివ్యూస్ అందుకుంది. రెండో రోజు కూడా కలెక్షన్లు పెద్దగా రాలేదు. వారం అంతా కూడా అంతంత మాత్రంగానే సినిమా రాబట్టింది సోమవారం రాగానే కలెక్షన్లు భారీ స్థాయిలో పడిపోయాయి. మూవీ ఆక్యుపెన్సీ కూడా 20 శాతానికి మించి పెరగలేదు. వర్కౌట్ కాలేదు.

family-star-movie

Advertisement

ఫ్యామిలీ స్టార్ సినిమా ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా 15 కోట్లు షేర్ కలెక్షన్లని మించకపోవచ్చు అయితే చిత్ర థియేటర్ హక్కులు 40 కోట్లు అంటే రాబట్టాల్సిన మొత్తంలో సగం కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టి సినిమా పెద్ద డిజాస్టర్ అవ్వబోతుందని కచ్చితంగా చెప్పొచ్చు. నైజాం వైజాగ్ ఏరియా లో మూవీ నిర్మాత దిల్ రాజు సొంతంగా సినిమా ని రిలీజ్ చేశారు.

Advertisement

Also read:

Also read:

మిగతా ఏరియాల్లో కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది దిల్ రాజు వారి నష్టాలని సెటిల్ చేస్తారో లేదో చూడాలి. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విజయ్ తన పద్ధతి మార్చుకోవాలని కంటెంట్ ఉన్న కథలను చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు ఒకవేళ కనుక విజయ్ దేవరకొండ సరైన కథలను ఎంచుకోకపోతే రిజల్ట్ ఇలాగే ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి రానున్న సినిమాల్లో అయినా విజయ్ దేవరకొండ కాస్త ఆచితూచి అడుగులు వేస్తాడో లేదో చూడాలి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading