ఐపీఎల్ 2022 లో నిన్న జరిగిన రెండు మ్యాచ్ లలో మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మధ్య జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. కేవలం 8 బంతుల్లోనే 30 పరుగులు సాధించడంతో హైదరాబాద్ ముందు ఆ జట్టు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ మ్యాచ్ లో ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్… అశ్విన్ ను అనుసరించాలి అనుకున్నాడట..!
Advertisement
ఇందులో అంటే.. ఐపీఎల్ 2022 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరపున ఆడుతున్న అశ్విన్.. లక్నో సూపర్ జెంట్స్ తో జరిగిన మ్యాచ్ లో రిటైడ్ ఔట్ అయిన విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ఇలా ఔట్ ఆయన మొదటి ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. అయితే ఇదే విధంగా నిన్న మ్యాచ్ లో తాను కూడా కార్తీక్ కోసం రిటైడ్ ఔట్ కావాలని భావించినట్లు డుప్లెసిస్ తెలిపాడు.
Advertisement
మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ… మ్యాచ్ చివర్లో నేను అలసిపోయాను. ఆ సమయంలో కార్తీ వస్తే భారీ షాట్స్ ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టిస్తాడు అని నాకు తెలుసు. అందుకే నేను అశ్విన్ మాదిరిగా రిటైడ్ ఔట్ అవ్వాలి అనుకున్నాను. కానీ అదే సమయంలో మాక్స్వెల్ ఔట్ అయ్యాడు. దాంతో నిన్ను అలాగే కొనసాగాను. ఆ తర్వాత వచ్చిన దినేష్ నేను అనుకున్న విధంగానే అద్భుతంగా ఆడాడు అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
వరుస గెలుపులతో ఉన్న ముంబై షాక్.. ఆటగాడికి మళ్ళీ గాయం..!
ధోనీ బ్యాట్ ను ఎందుకు కోరుకుతాడో తెలుసా..?