Home » ధోనీ బ్యాట్ ను ఎందుకు కోరుకుతాడో తెలుసా..?

ధోనీ బ్యాట్ ను ఎందుకు కోరుకుతాడో తెలుసా..?

by Azhar
Ad

ఐపీఎల్ 2022 మధ్యలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన మహేంద్ర సింగ్ ధోని… మళ్ళీ తన కెప్టెన్సీలో జట్టును విజయాల బాట పట్టించాడు. ధోని న్యాయకత్వంలో ఆడిన 3 మ్యాచ్ లలో చెన్నై రెండు విజయాలు నమోదు చేసింది. అయితే నిన్న ఢిల్లీ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై బ్యాటర్లు బాగా రాణించారు. ధోని కూడా తన పాత రూపాన్ని చూపించాడు. 8 బంతుల్లో 21 పరుగులు చేసాడు ధోని.

Advertisement

ఇదిలా ఉంటె… ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ కు రావడానికి ముందు ధోని తన బ్యాట్ ను కొరుకుతూ కనిపించాడు. గతంలో కూడా ఇలా బ్యాట్ ను కోరుకుతున్న ధోని ఫోటోలు బయటికి వచ్చాయి. కానీ ఎందుకు ధోని అలా కొరుకుతున్నాడు అనే కారణం తెలియక.. అభిమానులు రకరకాల ఊహాగానాలు సృషించుకునేవారు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది. ధోని ఎందుకు బ్యాట్ ను కొరుకుతున్నాడు అనే విషయాన్ని భారత మాజీ స్పిన్నర్ అమిష్ మిశ్రా అభిమానులకు వివరించాడు.

Advertisement

నిన్న బ్యాట్ కోరుకుతున్న ధోని ఫోటోలు వైరల్ కావడంతో స్పందించిన మిశ్రా… ”ధోని తరచుగా తన బ్యాట్‌ను ఎందుకు కొరుకుతున్నాడు అని మీరు ఆశ్చర్యపోతున్నారా… అతను అలా ఎందుకు చేస్తాడు అంటే… ధోని తన బ్యాట్ శుభ్రంగా ఉండాలని అనుకుంటాడు. అందుకే బ్యాట్ పైన ఉండే టేప్ తొలగించడానికి అతను అలా చేస్తాడు. కావాలంటే చూడండి.. ధోని బ్యాట్ పైన ఎప్పుడు మీకు టేప్ లేదా థ్రెడ్ అనేది కనిపించదు” అని మిశ్రా పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ టీంఇండియా మెంటర్ గా గంభీర్..?

చెన్నై గెలుస్తున్నా.. ఏడుస్తున్న అభిమానులు…!

Visitors Are Also Reading