మంచు విష్ణు అంటే టాలీవుడ్ లో పరిచయం అక్కర్లేని పేరు. ఢీ లాంటి సూపర్ హిట్ సినిమాతో మంచు విష్ణు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో మంచు విష్ణు కామెడీ టైమింగ్ సూపర్ అనే చెప్పాలి. అయితే మంచు విష్ణు దాదాపు 20 కి పైగా సినిమాలో నటించినప్పటికీ ఢీ తర్వాత మళ్లీ అంతటి హిట్ సినిమాను అందుకోలేకపోయాడు. చివరగా మంచు విష్ణు మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
Also Read: నయనతార సరోగసి ఎపిసోడ్ లో కొత్త మలుపులు ..? ఆ ఆధారాలను బయటపెట్టిన దంపతులు…!
Advertisement
ఈ సినిమా కూడా అభిమానులను నిరాశపరిచింది. ఇక మంచు విష్ణు మా ఎన్నికల్లోనూ పోటీచేసి అధ్యక్షుడిగా గెలిచిన సంగతి తెలిసిందే. ఎన్నో రాజకీయ పరిణామాల మధ్యన మా ఎలక్షన్ జరగ్గా అందులో విష్ణు విజయం సాధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇక ప్రస్తుతం విష్ణు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Advertisement
ఈ సినిమాలో సన్నీలియోన్ మరియు పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ మరియు వీడియోలు విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక మంచు విష్ణు పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ దగ్గరి బంధువు అయిన వీరానిక రెడ్డిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరానిక విష్ణులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Also Read: మరో తెలుగు సినిమాలో సల్మాన్ కు గెస్ట్ రోల్..!
అయితే మోహన్ బాబు మొదట ఓ స్టార్ హీరో కూతురుతో మంచు విష్ణు పెళ్లి చేయాలని అనుకున్నారట. తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయినా హీరో కూతురుతో విష్ణు వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ అప్పటికే విష్ణు విరానికతో ప్రేమలో పడ్డారు. ఇక ఆ విషయం మోహన్ బాబుకు చెప్పడంతో ఆయన కూడా విష్ణు మాటకు గౌరవం ఇచ్చి వీరవానికా రెడ్డి తోనే వివాహం జరిపించారు. ఇక ప్రస్తుతం విష్ణుకు ముగ్గురు కూతుళ్లతో పాటు ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
Also Read: కృష్ణంరాజుకు ఆ ఒక్క సినిమా అంటే చాలా ఇష్టమట.. నాన్నను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రసీద..!!