Home » మరో తెలుగు సినిమాలో సల్మాన్ కు గెస్ట్ రోల్..!

మరో తెలుగు సినిమాలో సల్మాన్ కు గెస్ట్ రోల్..!

by Azhar
Ad

సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో నెంబర్ 1 హీరో అనేది అందరికి తెలిసిందే. కానీ ఈ మధ్య అక్కడ తీస్తున్న హిందీ సినిమాల కంటే మన తెలుగు నుండి వెళ్లిన సినిమాలే అక్కడ ఎక్కువ కలెక్షన్స్ అనేవి చేస్తున్నాయి. గత ఏడాది నుండి ఇప్పటివరకు సౌత్ సినిమాలు అక్కడ సూపర్ హిట్ కొట్టాయి. దాంతో అక్కడ పెద్ద హీరో అయిన సల్మాన్ కు టాలీవుడ్ నుండో మరో సినిమాలో గెస్ట్ రోల్ కు ఆఫర్ వచ్చింది.

Advertisement

అయితే సల్మాన్ ఖాన్ ఈ మధ్యే విడుదల అయిన చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుగులో రాబోతున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2 నుండి కూడా సల్మాన్ కు పిలుపు వెళ్ళింది అని తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమా ఏ లెవల్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

Advertisement

ఎటువంటి అంచనాలు లేకుండా హిందీకి వెళ్లిన పుష్ప అక్కడ హల్ చల్ చేసింది. ఇక ఇప్పుడు పుష్ప 2 కోసం నార్త్ లో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రస్తుతం సుకుమార్ ఆ కథను సిద్ధం చేసి షూటింగ్ ప్రారంభించే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇందులోని ఓ పాత్రకు సల్మాన్ అయితే బాగుటుంది అని భావించి.. ఇప్పటికే ఆయనను సంప్రదించారట. మరి సల్మాన్ ఆ పాత్రకు ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

ఇండియా ప్రపంచ కప్ గెలవదను గంభీర్.. ప్లీజ్..!

ప్రపంచ కప్ లో ఈ రన్ ఔట్ జరుగుతుందా..?

Visitors Are Also Reading