Home » ఫేస్ బుక్ లవ్ స్టోరీ.. భారత యువకుడిని పెళ్లాడిన ఫారెన్ అమ్మాయి..!

ఫేస్ బుక్ లవ్ స్టోరీ.. భారత యువకుడిని పెళ్లాడిన ఫారెన్ అమ్మాయి..!

by Anji
Ad

సాధారణంగా ప్రేమ గుడ్డిది అంటుంటారు.. నీ నిజమైన ప్రేమలో ఎక్కడ కూడా అంధత్వం అనేది అస్సలు కనిపించదు. ప్రేమకు సరిహద్దులు లేవు. ఎందుకు అంటే చాలా సందర్భాల్లో దేశాలను దాటుకొని ప్రేమికులు తమ ప్రేమను గెలిపించుకుంటున్నారు. కొన్ని ప్రేమ కథలు కేవలం హాయ్, బాయ్ తో ముగుస్తుంటాయి. కానీ కొందరూ ప్రేమికులు ప్రేమించిన వారి కోసం ఎన్నో కష్టాలుపడుతుంటారు. త్యాగాలను చేస్తుంటారు. నేటి కంప్యూటర్ యుగంలో ఆసక్తికరమైన ప్రేమ కథలు దేశాలు, ఖండాంతరాలు దాటుతున్నాయి.

Advertisement

ఇప్పుడు ఫేస్ బుక్ లో ప్రేమించిన యువకుడి కోసం ఓ విదేశీ యువతి తన దేశం వదిలి వెళ్లి మరీ పెళ్లి చేసుకున్న అరుదైన ఘటన చోటు చేసుకున్నది. అలాంటి అద్భుతమైన ప్రేమకథ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు. స్వీడన్ కి చెందిన క్రిస్టెన్ లైబర్ట్ ఉత్తరప్రదేశ్ లో నివసిస్తున్న పవన్ కుమార్ తో పెళ్లి చేసుకోవడానికి నేరుగా భారతదేశానికి చేరుకున్నది. వారి ఆసక్తికరమైన ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫేస్ బుక్ లో స్నేహితులైన తరువాత క్రిస్టెన్, పవన్ తరచూ వీడియో కాల్స్ ద్వారా మాట్లాడుకునే వారు. 2012లో వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. కొద్ది రోజుల తరువాత వీరి స్నేహం ప్రేమగా మారింది. 

Advertisement

Also Read :   పచ్చి బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చపోతారు..!

పదేళ్ల ప్రేమకథను తమ గుండెల్లో పెట్టుకొని ఆగ్రాలోని తాజ్ మహల్ చూడడానికి వెళ్లిన ఈ జంట ప్రేమకు ప్రతీక అయినటువంటి తాజ్ మహల్ ని చూసిన తరువాత అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  వీరిద్దరి పెళ్లి ఫోటోను ఏఎన్ఐ ఓ ట్వీట్ చేసింది. పిల్లల ఆనందంలోనే అసలైన ఆనందం ఉందని వారి తల్లిదండ్రులు సంతోషంగా పెళ్లికి అంగీకరించారు. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలోనే పెళ్లి ఘనంగా జరిపించారు. స్వీడెన్ కి చెందిన క్రిస్టెన్ లైబర్ట్ మాట్లాడుతూ.. తాను ఇంతకు ముందే భారత్ కి వచ్చానని చెప్పింది. భారతదేశాన్ని తాను చాలా ప్రేమిస్తున్నానని చెప్పింది. భారతీయ సంప్రదాయ ప్రకారం.. వివాహం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పడం విశేషం.  

Also Read :   తెలుగు హీరోలను ప్రేమించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్..!!

Visitors Are Also Reading