Home » తెలుగు హీరోలను ప్రేమించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్..!!

తెలుగు హీరోలను ప్రేమించి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్స్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీ అంటేనే మహాసముద్రం లాంటిది. ఈ సముద్రంలో పడి బయటకు వచ్చిన వారు ఉంటారు. రావడానికి ప్రయత్నం చేసేవారు ఉంటారు. ఆ సముద్రంలో మునిగిపోయిన వారు కూడా ఉంటారు. అలాంటి సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ అంటే ప్రేమ వ్యవహారాలు కామన్.. కానీ ఈ హీరోయిన్స్, హీరోలతో ప్రేమలో పడి వారి కెరియర్ ను నాశనం చేసుకున్నారు.. మరి వారు ఎవరిని ప్రేమించారో ఇప్పుడు తెలుసుకుందాం..

రెజినా కసాండ్రా:

Advertisement


తెలుగు మెగా హీరో సాయిధరమ్ తేజ్ తో రెజీనా లవ్ లో ఉందనే ప్రచారం సాగింది. అయితే రెజీనా వైఖరి బాగోలేక మెగా ఫ్యామిలీ కాదనుకుందని అనేక వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ మెగా హీరోలతో సినిమా చేసిన ఈ రెజీనా ప్రస్తుతం ఆఫర్ల కోసం కొట్టుమిట్టాడుతోంది. అనేక సమస్యలు ఎదుర్కొంటోంది.
టబూ:

Advertisement

హీరోయిన్ టబు పక్కా తెలుగు అమ్మాయి. ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు అనే విషయం అందరికీ తెలుసు. అప్పట్లో ఈమె కింగ్ నాగార్జునతో రిలేషన్షిప్ లో ఉండటం వల్లే ఇలా పెళ్లి చేసుకోకుండా మిగిలిన టాక్ ఇప్పటికే ఉంది. ఈ విషయాన్ని అటు టబు గాని, ఇటు నాగార్జున గాని ఒప్పుకోరు.

అనుష్క శెట్టి:

పూరి జగన్నాథ్ నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమా సూపర్. ఈ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన యోగా టీచర్ అనుష్క శెట్టి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో పీకల్లోతు ప్రేమలో ఉందనే ప్రచారం సాగింది. ఈ తరుణంలోనే ప్రభాస్, అనుష్క ఫ్రెండ్షిప్ మాత్రమే అంటు కొట్టి పారేశారు. అంతేకాకుండా కోవెలమూడి ప్రకాశ్ ను పెళ్లి చేసుకుంటుందని, గోపీచంద్ ను ప్రేమిస్తుందని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు.

also read:కలెక్టర్ అయ్యుండి పెళ్లికి కట్నం అడిగాడు…అది ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే….!

Visitors Are Also Reading