Home » ఎఫ్ 3 పోస్ట‌ర్ విడుద‌ల‌.. బొమ్మ అదిరింది..!

ఎఫ్ 3 పోస్ట‌ర్ విడుద‌ల‌.. బొమ్మ అదిరింది..!

by Anji
Ad

తెలుగు అగ్ర హీరో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎఫ్‌3. గతంలో వచ్చిన ఎఫ్2 ఎంత విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2019 సంక్రాంతి కానుక గా విడుదలైన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ ఏడాది వచ్చిన అన్ని సినిమాల కంటే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా రానున్నది. ఈ సినిమా ఈ మధ్యనే పూర్తి చేసుకుంది. చిత్ర ప్రమోషన్ పై యూనిట్ ఫోకస్ పెట్టింది.

Advertisement

ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్లు అన్నీ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి. ఉగాది పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ మరొక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రతి ఒక్కరికి తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ సినిమాలోని ప్రధాన తారాగణం తో కూడిన ఈ పోస్టర్ ను వదిలారు. ఆ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎఫ్ 2 లో భార్య బాధితులు గా కనిపించిన వెంకటేష్, వరుణ్ తేజ్ తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో చేతిలో ఫోన్‌ పట్టుకుని వారిని భయపెట్టడం ఆసక్తిని కలిగించింది. మొత్తానికి ఈ సినిమా చూస్తే బొమ్మ హిట్టు అని అనుకుంటున్నారు అభిమానులు.

Advertisement


ముఖ్యంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్, వెన్నెలకిషోర్, సునీల్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ పోస్టర్ లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. మే 27న థియేటర్లో నవ్వుల హంగామా చేయడానికి కుటుంబం సిద్ధంగా ఉన్నది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలంటే మే 27 వరకు ఆగాల్సిందే.

Visitors Are Also Reading