Home » Extra Ordinary Man First Review : ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫస్ట్ రివ్యూ.. నితిన్ కి హిట్ పడ్డట్టేనా..?

Extra Ordinary Man First Review : ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ ఫస్ట్ రివ్యూ.. నితిన్ కి హిట్ పడ్డట్టేనా..?

by Anji
Ad

Extra Ordinary Man First Review : టాలీవుడ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.   భీష్మ మూవీ తర్వాత నితిన్ కి సరైన సక్సెస్ అస్సలు పడటం లేదు.  ‘రంగ్ దే’ కొంత వరకు పర్వాలేదనిపించినా..  కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా అది యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాచర్ల నియోజకవర్గం  సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఏడాది గ్యాప్ తీసుకుని ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు నితిన్.  తాజాగా ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ మూవీకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఫస్ట్ రివ్యూ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్”. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 8న థియేటర్లలోకి రానుంది. మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. “నా పేరు సూర్య మూవీ”తో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ ఫస్ట్ మూవీతోనే ప్లాఫ్ అందుకున్నాడు. “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” డైరెక్టర్ వక్కంతం వంశీ రెండవ చిత్రం కావడం గమనార్హం.  సినిమాలో నటించిన హీరో హీరోయిన్లతో పాటు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీష్ జయరాజ్ కూడా ఈ మూవీ పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని మంచి పట్టుదలతో ఉన్నారు.

Advertisement


మూవీ ఎలా ఉందన్న విషయం రిలీజ్ కు ముందే బయటకు వచ్చేసింది. ఆ టాక్ ప్రకారం.. “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ ఫస్ట్ హాఫ్ హిలేరియస్ గా ఉందట. కానీ సెకండ్ హాఫ్ విషయానికి రాగానే కాస్త బోరింగ్ గా అనిపిస్తుందట. అయితే ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మొత్తానికి ఫస్ట్ రివ్యూనే పాజిటివ్ గా ఉండడంతో ఈసారి నితిన్ హిట్ కొట్టడం పక్క అంటున్నారు సినీ విశ్లేషకులు. సెకండ్ హాఫ్ .. కథ వేరే టర్న్ తీసుకుంటుంది అంటున్నారు. ఈ క్రమంలో కొంత రొటీన్ గా అనిపిస్తుంది అని కూడా వారు చెబుతున్నారు. అయితే రాజశేఖర్ పాత్ర ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది అని చెబుతున్నారు. నితిన్, రాజశేఖర్..ల పాత్రలకి మంచి మార్కులే పడ్డట్టు తెలుస్తోంది.  మొత్తానికి ఈ సినిమాపై అంచనాలు తక్కువగా ఉండడం కూడా నితిన్ కు ప్లస్ పాయింట్ అవుతుంది. ఈ మూవీతో నితిన్ కి హిట్ పడిందో లేదో వేచి చూడాలి మరీ.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading